
రాజస్థాన్ మంత్రి సురేష్ రావత్ ఇంట్లోకి చిరుతపులి ప్రవేశించింది! అవును, జైపూర్‌లోని సివిల్ లైన్స్‌లోని మంత్రి నివాసంలో అకస్మాత్తుగా ఒక చిరుతపులి కనిపించింది. దీంతో సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏకంగా మంత్రి సురేష్ రావత్ అధికారిక నివాస సముదాయంలోకి ప్రవేశించడం కలకలం సృష్టించింది. చిరుతపులి కదలికతో నివాసంలోని సిబ్బంది ఆశ్చర్యపోయారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు.
మంత్రి నివాసంలో చిరుతపులి ఉన్నట్లు సమాచారం అందడంతో, అటవీ శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. చిరుత పులిని బంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. జైపూర్‌లో ఇంతకు ముందు కూడా చిరుత పులులు సంచరించాయి. అనేక నివాస ప్రాంతాలలోకి ఈ అడవి జంతువు ప్రవేశించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా గురువారం (నవంబర్ 20) ఉదయం మంత్రి సురేష్ రావత్ అధికారిక నివాసంలో ఈ చిరుతపులి కనిపించింది.
మంత్రి సురేష్ రావత్ నివాసంలోని చిరుతపులి కదలిక గురించి అటవీ శాఖకు సమాచారం అందించారు. ఇదిలావుంటే, ఈ ప్రాంతంలో అన్ని ప్రభుత్వ మంత్రుల అధికారిక బంగ్లాలు ఉన్నాయి. రాజ్ భవన్ తోపాటు కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ అధికారిక నివాసం మంత్రి సురేష్ రావత్ బంగ్లాకు ఎదురుగా ఉన్నాయి.
నివాస ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు వార్తలు రావడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. రోడ్డుకు ఇరువైపులా మూసివేశారు. చిరుతపులి తన స్థానాన్ని మారుస్తూ ఉండటంతో దానిని పట్టుకోవడం కష్టమవుతోంది. అటవీ శాఖ అధికారులు, వైద్యులు ఘటనా స్థలంలో ఉన్నారు. చిరుత పులిని బంధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
🐆 Leopard Enters Minister’s Bungalow and School in Jaipur
Leopard: Children locked in classrooms; currently moving from one house to another in VVIP area.The leopard has reached Civil Lines, the VVIP area of the capital, Jaipur. The leopard entered the Tiny Blossom Senior… pic.twitter.com/5MFsNsT6J3
— Saracastic Khabari (@Saracastic_SR) November 20, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..