డ్రైవింగ్‌ చేస్తూ సీట్లోనే నిద్రపోయిన డ్రైవర్‌ బాబు.. రోడ్డుపై బస్సు బోల్తా! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు నడుపుతున్న ఓ డ్రైవర్‌.. డ్రైవింగ్ సమయంలో నిద్రపట్టడంతో అలా కన్నుమూశాడు. అంతే దెబ్బకు బస్సు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 17 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేట్ ట్రావెల్ కంపెనీకి చెందిన..

డ్రైవింగ్‌ చేస్తూ సీట్లోనే నిద్రపోయిన డ్రైవర్‌ బాబు.. రోడ్డుపై బస్సు బోల్తా! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Rajasthan Bus Accident

Updated on: May 25, 2025 | 11:32 AM

జైపూర్‌, మే 25: భూమిపై సంచరించే ప్రతి ప్రాణికి నిద్ర అవసరం. కంటికి సరిపడా నిద్రలేకుంటే ఆరకొర నిద్రతో పనులు చేయవల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల పెద్ద ప్రమాదాలే జరుగుతాయి. రాజస్థాన్‌లో ఇలాంటి ఓ దారుణ రోడ్డు ప్రమాదం తాజాగా చోటు చేసుకుంది. రాజ్‌సమంద్‌ జిల్లాలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు నడుపుతున్న ఓ డ్రైవర్‌.. డ్రైవింగ్ సమయంలో నిద్రపట్టడంతో అలా కన్నుమూశాడు. అంతే దెబ్బకు బస్సు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 17 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రైవేట్ ట్రావెల్ కంపెనీకి చెందిన సదరు బస్సు అహ్మదాబాద్ నుంచి భిల్వారాకు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. డ్రైవర్‌ నిద్ర మత్తులోకి జారుకోవడంతోనే ప్రమాదం సంభవించినట్లు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని కాంక్రోలి పోలీస్ స్టేషన్ CI హన్సారాం తెలిపారు. ప్రమాదం అనంతరం డ్రైవర్ బస్సు వదిలి పరారైనట్లు సమాచారం. అసలేం జరిగిందంటే..

ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్‌ బస్సు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి రాజస్థాన్‌లోని భిల్వారాకు వెళ్తోంది. ఈ క్రమంలో రాజ్‌సమంద్‌ జిల్లా భవ బస్‌ స్టాండ్‌ సమీపంలోకి రాగానే బస్సు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో బీహార్‌లోని చయాన్‌పూర్‌కి చెందిన అఖిలేష్ (25), భిల్వారాలోని సురవస్ పోట్ల నివాసి గీతా అహిర్ (30), భిల్వారాలోని పూర్‌కి చెందిన ఆసిఫ్ మహ్మద్ (27) అనే ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. 17 మంది తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే చికిత్స కోసం ఆర్కే ఆసుపత్రికి తరలించారు.

ఘటన జరిగిన కొద్దిసేపటికే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని, బోల్తా పడిన బస్సును క్రేన్ సహాయంతో నిటారుగా ఉంచి, గాయపడిన ప్రయాణికులందరినీ బయటకు తీసి, తక్షణ వైద్య సహాయం అందించారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసధికారి ఒకరు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.