Indian Railways: భారత రైల్వే సంచలన నిర్ణయం.. ప్రయాణంలో కూడా మాస్క్‌ ధరించాల్సిందే.. లేకపోతే..

|

Apr 17, 2021 | 2:51 PM

Indian Railways: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి కేసుల సంఖ్య రెండు లక్షల మార్క్‌ దాటుతోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బడిముబ్బడిగా కేసులు

Indian Railways: భారత రైల్వే సంచలన నిర్ణయం.. ప్రయాణంలో కూడా మాస్క్‌ ధరించాల్సిందే.. లేకపోతే..
Indian Railways
Follow us on

Indian Railways: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల నుంచి కేసుల సంఖ్య రెండు లక్షల మార్క్‌ దాటుతోంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఇబ్బడిముబ్బడిగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. నిత్యం ఈ ప్రాంతంలో 50వేలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఆ తర్వాత ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, పంజాబ్‌, కేరళ, రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించకపోవడం వల్లనే కేసులు భారీగా పెరుగుతున్నాయని పలు అధ్యయనాలు సైతం పేర్కొంటున్నాయి. ఈ తరుణంలో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగా.. రైళ్లల్లో ప్రయాణించే ప్రయాణికులు మాస్కు ధరించకపోతే రూ.500లు జరిమానా విధించనున్నట్లు పేర్కొంది. ఆరు నెలల పాటు ఈ నిబంధన వర్తిస్తుందని రైల్వేశాఖ వెల్లడించింది. దీంతోపాటు రైళ్ల పరిసరాల్లో ఉమ్మి వేసినా.. ఇదే జరిమానా విధిస్తామని పేర్కొంది. కోవిడ్‌ దృష్ట్యా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ముఖ్యంగా, వలస కార్మికులు ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లోని రైల్వే స్టేషన్లలో గత కొన్ని వారాలుగా ప్రయాణీకుల రద్దీ భారీగా ఉంది. లాక్‌డౌన్‌లో వలస కూలీలు.. ఆయా ప్రాంతాల నుంచి ఇళ్లకు వెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం వారు.. మళ్లీ పనుల కోసం పలు ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ తరుణంలోనే దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలు కావడంతో.. మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారని.. కార్మికులంతా మళ్లీ ఇళ్లకు పయనమవుతున్నారు. దీంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి ప్రయాణికులు మరలా వారివారి రాష్ట్రాలకు వెళుతుండటంతో.. రైల్వే కరోనా కట్టడికి ఈ చర్యలు తీసుకుంది. ఇదిలాఉంటే.. ఆయా రాష్ట్రాలకు వెళుతున్న కార్మికులకు సైతం ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

కాగా.. గత 24 గంటల్లో 2.34 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా.. 1300 మంది మరణించారు. కరోనా కేసుల ప్రారంభం నాటి నుంచి దేశంలో అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా మొత్తం టీకాల సంఖ్య 12 కోట్ల మార్కుకు చేరుకుంది.

రైల్వే జారీ చేసిన జీవో కాపీ..

Indian Railways

Also Read:

Sonu Sood: రియల్ హీరో సోనూసూద్‌కు కరోనా పాజిటివ్.. ఏమని ట్విట్‌ చేశాడో తెలుసా..?

Lalu Prasad Yadav: ఎట్టకేలకు లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్.. ప్రస్తుతం ఎయిమ్స్‌లోనే బీహార్‌ నేత..