సమాజంలోని వివక్షలకు ధీటైన సమాధానం ఇచ్చేలా కొందరు ట్రాన్స్‌జెండర్లు ఇప్పటికే పలు ఉన్నత స్థానాలను అధిగమించి తామేంటో నిరుపించుకున్నారు. ఈ క్రమంలోనే అసోంలోని ట్రాన్స్‌జెండర్ల సంఘం మరో అడుగు ముందుకేసింది. ఆ రాష్ట్ర ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటైన గువహతి రైల్వే స్టేషన్‌లో సదరు సంఘం తమ టీ స్టాల్‌ను ప్రారంభించింది. ఇక రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ప్రారంభించిన దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్ టీ స్టాల్‌గా ఇది నిలిచింది. ఈ నేపథ్యంలో సోమవారం(మార్చి 13) ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ‘భారత్‌లోని రైల్వే ప్లాట్‌ఫారమ్‌లపై తొలి ట్రాన్స్ టీ స్టాల్.. గువహతి రైల్వే స్టేషన్’ అంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్టవ్.. టీ స్టాల్ చిత్రాలను కూడా పోస్ట్ చేశారు.
టీస్టాల్ వివరాల్లోకి వెళ్లే.. ‘ఆల్ అస్సాం ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఈ స్టాల్ ప్రారంభించబడింది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సంబంధించి సుప్రీం కోర్టు నిర్ణయం తర్వాత 25 డిసెంబర్ 2015న ఈ సంఘం ఏర్పడింది. ఈ సంస్థ సమాజంలోని ట్రాన్స్‌జెండర్ల జీవనోపాధి, హక్కులు, గౌరవం కోసం స్థాపితమై కృషి చేస్తోంది.
India’s first “Trans Tea Stall” at a railway platform.
?Guwahati Railway Station pic.twitter.com/JSi8OS9VKM
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 13, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.