ఆ ‘రియల్ హీరో’ కు రూ. 50 వేల రివార్డు, సరికొత్త జావా బైక్ కూడా ! రైల్వే శాఖ ప్రకటన

| Edited By: Phani CH

Apr 21, 2021 | 3:49 PM

ముంబైలోని వంగానీ రైల్వే స్టేషన్ లో   నెల 17 న రైలు కింద పడబోయిన ఆరేళ్ల బాలుడ్నిరక్షించిన ఉద్యోగి మయూర్ షేక్ కి రైల్వే శాఖ 50 వేల రూపాయల రివార్డును ప్రకటించింది.

ఆ రియల్ హీరో కు రూ. 50 వేల రివార్డు, సరికొత్త జావా బైక్ కూడా ! రైల్వే శాఖ ప్రకటన
Mayur Shelke A Central Railway Employee, Has Been Awarded Rs 50,000 For Saving A Child
Follow us on

ముంబైలోని వంగానీ రైల్వే స్టేషన్ లో   నెల 17 న రైలు కింద పడబోయిన ఆరేళ్ల బాలుడ్నిరక్షించిన ఉద్యోగి మయూర్ షేక్ కి రైల్వే శాఖ 50 వేల రూపాయల రివార్డును ప్రకటించింది. అతడిని ‘రియల్ హీరో’గా అభివర్ణించిన అధికారులు సరికొత్త జావా మోటార్ బైక్ ని కూడా గిఫ్ట్ గా అందజేశారు. పాయింట్స్ మన్ గా పని చేసే   మయూర్ షేక్..తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ చిన్నారిని కాపాడాడని, ఇతని ధైర్య సాహసాలకు విలువ కట్టలేమని అనుపమ్ తరేజా అనే  అధికారి అన్నారు. ఇతడిని సత్కరించడం తమకు గర్వ కారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నెల 17  సాయంత్రం 5 గంటల  ప్రాంతంలో వంగానీ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్ పై నడచుకుంటూ వెళ్తున్న బాలుడు బ్యాలన్స్ తప్పి హఠాత్తుగా కింద రైలు పట్టాలపై పడిపోయాడు . అతనితో బాటు ఉన్న ఓ వృధ్ధ మహిళ తన చిన్నారిని కాపాడాలంటూ కేకలు పెట్టింది. అప్పటికే ఓ సబర్బన్ రైలు ఆ పట్టాలపైకి దూసుకువస్తోంది. ఇది గమనించిన  మయూర్ షేక్.. పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బాలుడిని పట్టాలపై నుంచి పైకి తీసి.. ప్లాట్ ఫామ్ పై ఉంచాడు. కేవలం  కొన్ని  క్షణాల్లో ఇదంతా  జరిగిపోయింది.

ఈ వైనమంతా సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. మయూర్ సమయస్ఫూర్తిని . అతని ధైర్య సాహసాలను నిన్న ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైల్వే అధికారులు, ఇతర సిబ్బంది  చప్పట్లు కొడుతూ అభినందించారు. మరోవైపు రైల్వే శాఖ మంత్రి  పీయూష్ గోయెల్ కూడా మయూర్ ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ఇతనిలాంటి ఉద్యోగులు ఉండడం రైల్వే శాఖకే గర్వకారణమన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Triple Mutation Variant: భార‌త్‌లో క‌రోనా విశ్వ‌రూపం.. తాజాగా మ‌రో కొత్త వేరియంట్ గుర్తింపు..

Covishield Vaccine: ‘కోవిషీల్డ్’ ధరలను ప్రకటించిన సీరం ఇన్‌స్టిట్యూట్.. ఎంతకు విక్రయించనున్నారంటే?