
కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం అహ్మదాబాద్‌లోని జాతీయ హై-స్పీడ్ రైలు ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టులో ప్రధాన భాగమైన NH-48పై స్టీల్ బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని కూడా కేంద్రమంత్రి సందర్శించారు. దీనితో పాటు, వైష్ణవ్ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్టును పరిశీలించి, బుల్లెట్ రైలు ప్రాజెక్టులో 360 కి.మీ పూర్తయిందని, దీనిలో మహారాష్ట్ర విభాగం గణనీయమైన పురోగతి సాధించిందని ప్రకటించారు.
ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై పని చేస్తోన్న కార్మికులతో ముచ్చటించారు. జాతి నిర్మాణానికి వారు చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. అలాగే రైల్వేమంత్రి కార్మికులతో కలిసి సెల్ఫీ దిగారు. రైల్వేమంత్రి తమతో ముచ్చటించడం.. కార్మికులకు ఆనందాన్ని ఇచ్చింది. వారంతా ‘భారత్ మాత కీ జై’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కార్మికులు.. ప్రభుత్వం, మంత్రులు తమకు అంత గౌరవం ఇస్తున్నప్పుడు, తాము కూడా దేశాభివృద్ధిలో తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులలో చాలా చోట్ల ప్రత్యేకమైన నిర్మాణం జరుగుతోందని వైష్ణవ్ అన్నారు. ఈ వంతెన బరువు 1100 టన్నుల కంటే ఎక్కువ. దాని ప్రత్యేక భాగాలు భారతదేశంలో తయారు చేయబడ్డాయి.
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం పొడవు: 508 కి.మీ (గుజరాత్ మరియు డిఎన్హెచ్: 352 కి.మీ, మహారాష్ట్ర: 156 కి.మీ)
12 స్టేషన్ల నిర్మాణం: ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భారుచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి.
13 నదులపై వంతెనల పనులు పూర్తయ్యాయి. అవి: పర్ (వల్సాద్), పురాణ (నవ్‌సరి), మింధోల (నవ్‌సరి), అంబిక (నవ్‌సరి), ఔరంగ (వల్సాద్), వెంగానియా (నవ్‌సరి), మోహర్ (ఖేడా), ధధర్ (వడోదర), కోలక్ నది (వల్సాద్), వత్రక్ నది (ఖేడా), కావేరి నది (నవ్‌సరి), ఖర్రా (నవ్‌సరి), మరియు మేష్వా (ఖేడా).
ఆరు స్టీల్ వంతెనలు, ఐదు PSC వంతెనలు పూర్తయ్యాయి.
130 కి.మీ విస్తీర్ణంలో శబ్ద నిరోధకాలు ఏర్పాటు చేయబడ్డాయి.
గుజరాత్‌లో 112 కిలోమీటర్ల ట్రాక్ బెడ్ పనులు పూర్తయ్యాయి.
గుజరాత్‌లో ఓవర్ హెడ్ విద్యుత్ సరఫరా పనులు ప్రారంభమయ్యాయి.
మహారాష్ట్రలోని బికెసి, శిల్పాటా మధ్య 21 కి.మీ పొడవైన సొరంగం పనులు జరుగుతున్నాయి.
పాల్ఘర్ జిల్లాలో ఏడు పర్వత సొరంగాల పనులు NATM సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి జరుగుతున్నాయి.
గుజరాత్‌లోని ఎనిమిది స్టేషన్లలో ఆరు స్టేషన్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
మూడు ఎలివేటెడ్ స్టేషన్లలో పనులు ప్రారంభమయ్యాయి. ముంబై బుల్లెట్ రైలు స్టేషన్‌లో బేస్ స్లాబ్ వేయబడుతోంది.
Union Minister @AshwiniVaishnaw interacts with workers working on the bullet train project. He congratulated them for their contribution to nation-building and took selfies with them.@RailMinIndia pic.twitter.com/6BkiC8h71G
— DD News (@DDNewslive) March 1, 2025