Kurkure: కుర్‌కురే ప్యాకెట్లలో బయటపడ్డ రూ.500 నోట్లు.. కొనేందుకు ఎగబడుతున్న జనాలు.. దుకాణాలు ఖాళీ

|

Dec 16, 2022 | 11:27 AM

ఐదు రూపాయలు, రెండు రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఒక్కో కుర్‌కురే ప్యాకెట్‌లో 5-6 నోట్లు దొరికాయి. కొందరికి రెండు మూడు నోట్లు కూడా వచ్చాయి. ఇలా వివిధ ప్యాకెట్లలో సుమారు 20 వేల వరకు డబ్బు దొరికింది. ఒక్కరోజునే బస్తాల కొద్దీ కుర్‌కురే ప్యాకెట్లు అయిపోవటంతో ఆ వెంటనే దుకాణదారులు కొత్త స్టాక్ తీసుకొచ్చారు.

Kurkure: కుర్‌కురే ప్యాకెట్లలో బయటపడ్డ రూ.500 నోట్లు.. కొనేందుకు ఎగబడుతున్న జనాలు.. దుకాణాలు ఖాళీ
Kurkure
Follow us on

పిల్లలు ఇష్టంగా తినే కుర్కురేను ఇవ్వడానికి తల్లిదండ్రులు ఒప్పుకోరు. కుర్‌కురే తింటే ఆరోగ్యానికి మంచిది కాదని పిల్లలకు చెబుతుంటారు. వీలైనంత వరకు కుర్‌కురే వంటి ఆహారాలకు దూరంగా ఉండాలని, వాటిని మానుకోవాలని చెబుతుంటారు. కానీ రాయచూరులో మాత్రం కుర్ కురే ప్యాకెట్‌లు ఎగబడి కొంటున్నారు. పిల్లలే కాకుండా, తల్లిదండ్రులు కూడా కుర్ కొనేందుకు బారులు తీరటంతో దుకణాలే ఖాళీ అయిపోయాయి. అంతగా జనం కుర్‌కురే కోసం ఎగబడుతున్నారో తెలిస్తే మాత్రం మీరు కూడా క్యూ కట్టకమానరు. రాయచూర్ జిల్లా లింగసుగూర్ తాలూకా హునూర్ గ్రామంలో చిన్నారుల కుర్ కురే ప్యాకెట్ లో 500 రూపాయల నోట్లు బయటపడ్డాయి. వివిధ కంపెనీలకు చెందిన రూ.5. రూ. 2రూపాయల కుర్ కురే ప్యాకెట్‌లలో 500 డినామినేషన్ నోట్లు కనిపించటంతో కుర్ కురే కొనుగోలు చేసేందుకు జనం ఎగబడ్డారు.

ఐదు రూపాయలు, రెండు రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఒక్కో కుర్‌కురే ప్యాకెట్‌లో 5-6 నోట్లు దొరికాయి. కొందరికి రెండు మూడు నోట్లు కూడా వచ్చాయి. ఇలా వివిధ ప్యాకెట్లలో సుమారు 20 వేల వరకు డబ్బు దొరికింది. గత నాలుగైదు రోజులుగా హూనూరు గ్రామంలోని కొన్ని దుకాణాల్లో కొనుగోలు చేసిన కుర్ కుర్ ప్యాకెట్లలో డబ్బులు దొరుకుతున్నాయనే విషయం ఆ చుట్టు పక్కల గ్రామాలకు దావానంలా వ్యాపించింది. దీంతో కుర్‌కురే కొనుగోళ్లతో దుకాణాలు ఖాళీ అయిపోయాయి.

ఇవి కూడా చదవండి

ఒక్కరోజునే బస్తాల కొద్దీ కుర్‌కురే ప్యాకెట్లు అయిపోవటంతో ఆ వెంటనే దుకాణదారులు కొత్త స్టాక్ తీసుకొచ్చారు. కానీ, వాటిలో నోట్లు కనిపించలేదని తెలిసింది. ఇటీవల కుర్ కురే కొనుగోలు చేసిన వారికి నిరాశే ఎదురైంది. అయితే నాలుగైదు రోజులుగా దొరికిన నోట్లు నకిలీనోట్లా.. అసలైన నోట్లా అనే విషయంలో గందరగోళం నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి