
జార్ఖండ్‌లో రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతోంది. జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనతో భేటీ అయ్యారు రాహుల్. హేమంత్ సోరెన్‌ను ఈడీ అన్యాయంగా అరెస్ట్ చేసిందన్నారు. న్యాయాన్ని గెలిపించడం కోసమే తాను దేశవ్యాప్తంగా భారత్ జోడో న్యాయ్ యాత్ర చేపట్టినట్టు తెలిపారు.
ఇండియా కూటమి అధికారం లోకి వస్తే 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామన్నారు. ఆదివాసీల హక్కులను కాపాడుతామాని తెలిపారు. జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్షలో ఇండియా కూటమి గెలవడంపై రాహుల్‌గాంధీ హర్షం వ్యక్తం చేశారు. జార్ఖండ్ సంపదను ప్రధాని మోదీ అదానీకి కట్టబెట్టేందుకు కంకణం కట్టుకున్నారని అన్నారు రాహుల్. ప్రభుత్వ రంగ సంస్థల పేర్లు అదానీ కంపెనీగా మారబోతున్నాయన్నారు.” మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల గొంతు నొక్కుతోంది. ఎందుకంటే ఈ సంస్థ పనిచేయకూడదన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది. రానున్న కాలంలో ఏజీసీ ఫ్యాక్టరీ పేరును అదానీ కంపెనీగా మారుస్తారు” అని రాహుల్ పేర్కొన్నారు.
పార్లమెంట్‌లో విపక్షాలపై మోదీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రాహుల్. దేశంలో పేద,ధనిక కులాలు మాత్రమే ఉన్నాయన్న మోదీ ఇప్పుడు ఓబీసీ అని ఎలా చెప్పకుంటున్నారని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.