రాహుల్ గాంధీ మరోసారి కోర్టు మెట్లు ఎక్కనున్నారు. పరువు నష్టం కేసు విచారణలో భాగంగా ఇవాళ పాట్నా కోర్టు ఎదుట హాజరుకానున్నారు. బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ.. రాహుల్‌పై పరువు నష్టం దావా వేశారు. ఇటీవల జరిగిన లోక్‌పభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్ జిల్లాలో దొంగలందరి ఇంటి పేరు మోదీ ఉందని అన్నారు. దీనిపై తమను కించపరిచారంటూ బీజేపీ కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని బ్యాంకులను కొల్లగొట్టిన వారితో పోల్చారు. ఆర్థిక నేరగాళ్లు నీరవ్ మోదీ, లలిత్ మోదీని ఉద్దేశించి రాహుల్ విమర్శించారు.