Assembly Elections: వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

|

Sep 24, 2023 | 8:11 PM

త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అసెంబ్లీ ఎన్నికలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో తమ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా విపక్ష పార్టీలన్ని కలిసి కట్టుగా పనిచేస్తున్నాయని.. అయితే ఈ ఫలితాలు బీజేపీని ఆశ్చర్యానికి గురిచేస్తాయని వ్యాఖ్యానించారు.

Assembly Elections: వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తాం.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
Follow us on

త్వరలోనే ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అసెంబ్లీ ఎన్నికలపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో తమ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా విపక్ష పార్టీలన్ని కలిసి కట్టుగా పనిచేస్తున్నాయని.. అయితే ఈ ఫలితాలు బీజేపీని ఆశ్చర్యానికి గురిచేస్తాయని వ్యాఖ్యానించారు. అదే విధంగా.. కర్ణాటకలో తాము నేర్చుకున్నటువంటి.. పలు ముఖ్య విషయాలను దృష్టిలో పెట్టుకొని రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మేరకు ఢిల్లీలో జరిగినటువంటి ఓ కార్యక్రమంలో ఆదివారం రాహుల్ గాంధీ మాట్లాడారు.

తెలంగాణలో కాంగ్రెస్ అవకాశాలున్నట్లు తెలిపారు. అలాగే మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో కూడా కచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పారు. రాజస్థాన్‌‌లో కూడా విజయానికి దగ్గర్లో ఉన్నామని.. ఆ రాష్ట్రంలో కూడా గెలిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం బీజేపీకి కూడా తెలుసని.. కానీ దీన్ని బయటకు చెప్పడం లేదని అన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో గెలవకపోవడం అనే ప్రశ్న లేదని పేర్కొన్నారు. కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికల్లో తాము గుణపాఠాన్ని నేర్చుకున్నామన్నారు. అయితే బీజేపీ ఎన్నికల్లో విపక్షాల వాదనను ప్రజలకు చేరవేయకుండా.. దృష్టి మరల్చే కార్యక్రమాలు చేస్తోందని అన్నారు. అందుకే కర్ణాటకలో బీజేపీ అంచనాలను దాటి మరి పోరాడి గెలిచినట్లు చెప్పారు. మరోవైపు బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి సైతం ఇటీవల బీఎస్పీ డానిష్ అలపై మతపరమైన దుషణలు చేసి విద్వేశాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారని మండిపడ్డారు. అలాగే కులగణన కూడా దేశ ప్రజలకు ముఖ్యమని.. దీన్ని బీజేపీ కోరుకోవడం లేదని విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా.. కాగా ఈ ఏడాది చివరి నెలలో మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, తెలంగాణతోసహా మిజోరం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..