బిహార్ సీఎం నితీష్‌కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరడంతో ఇండియా కూటమికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు రాహుల్‌గాంధీ. నితీష్ యూటర్న్‌లను చూసి గవర్నరే ఆశ్చర్యపడుతున్నారని సెటైర్ వేశారు. ఇండియా కూటమి కులగణన చేస్తుందన్న భయంతోనే నితీష్‌పై బీజేపీ ఒత్తిడి చేసిందని విమర్శించారు రాహుల్. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా బిహార్‌లో పర్యటిస్తున్న రాహుల్ మంగళవారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్‌లో కొనసాగుతోంది. ఇండియా కూటమికి షాకిచ్చిన బిహార్ సీఎం నితీష్‌పై తొలిసారి విరుచుకుపడ్డారు రాహుల్‌గాంధీ. నితీష్‌కుమార్ యూటర్న్ సీఎం అని సెటైర్లు విసిరారు. నితీష్‌కుమార్ యూటర్న్‌లను చూసి గవర్నరే ఆశ్చర్య పడుతున్నారని అన్నారు. బిహార్‌లో కులగణన చేస్తామని ఇండియా కూటమి ప్రకటించిందన్నారు రాహుల్. ఈ ప్రకటన రాగానే బీజేపీలో వణుకు ప్రారంభమయ్యిందని అన్నారు. అందుకే నితీష్‌పై ఒత్తిడి చేసి ఎన్డీఏలో చేర్చుకున్నారని రాహుల్ విమర్శించారు. శాలువాను మర్చిపోయానని చెప్పి నితీష్ రాజ్‌భవన్‌లో బీజేపీ నేతలతో జతకట్టారని విమర్శించారు.
ఇదిలా ఉంటే.. పూర్ణియా జిల్లాలో జోడో యాత్ర సందర్భంగా రాహుల్ రైతుగా మారారు. రైతుల సమస్యలను రాహుల్ అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని రాహుల్ విమర్శించారు. ఇండియా కూటమి అధికారం లోకి వస్తేనే రైతుల కష్టాలు తీరుతాయన్నారు. సామాజిక న్యాయం , ఆర్ధిక న్యాయం కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు రాహుల్‌గాంధీ. నితీష్‌కుమార్ కూటమి నుంచి బయటకు వెళ్లడంతో ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..