ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. కేరళలో వరద పరిస్థితిపై మోదీకి వివరణ ఇచ్చిన రాహుల్.. వరద బాధితులను ఆదుకోవాలని, కేరళకు సహాయం చేయాలని కోరారు. అయితే ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేసిన రాహుల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటివరకు 20మంది మృతి చెందగా.. 13వేల మందికి పైగా నిరాశ్రయులు అయ్యారు. మరో కొన్ని రోజులు భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉండటంతో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.