
రఫెల్ విమానాల డీల్ పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మళ్ళీ ఫైరయ్యారు. ‘సీఏజీ డ్రాప్స్, ఆడిట్ ఆఫ్ రఫెల్, ఆఫ్ సెట్ డీల్ సోర్స్’అన్న శీర్షికతో వఛ్చిన వార్తను ఆయన ఉటంకిస్తూ.. ఈ ఒప్పందంలో భారత ఖజానా నుంచి డబ్బును దొంగిలించారని ట్వీట్ చేశారు. ‘సత్యం ఒకటే. .కానీ దారులు వేరు’ అని నాడు మహాత్ముడు ప్రవచించిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. అయితే బీజేపీ నేత, కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఖండిస్తూ.. రఫెల్ పై రాహుల్ ప్రకటనలను ఆయన పార్టీలోనివారే లోలోపల ఖండిస్తున్నారని అన్నారు. తన (రాహుల్)తండ్రి చేసిన పాపాలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నాయని వారు తమలోతాము అనుకుంటున్నారని ఆయన ప్రత్యారోపణ చేశారు.