Belur Temple: కర్ణాటకలోని హాసన జిల్లా బేలూరులోని చెన్నకేశవస్వామి రథోత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ వేడుకను కనులారా వీక్షించడానికి ఇతర జిల్లాల వారే కాకుండా, ఇతర రాష్ట్రాల భక్తులు కూడా హాజరవుతుంటారు. ఏప్రిల్ 8న మొదలైన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చిత్ర పటాన్ని అభిమానులు ప్రదర్శించారు. ఇక ఈ ఆలయం ప్రాముఖ్యత విషయానికొస్తే.. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ప్రసిద్ధ చెన్నకేశవ దేవాలయాన్ని పన్నెండవ శతాబ్దంలో హొయసల రాజు విష్ణువర్ధనుడు నిర్మించారు. 116లో చోళులపై సాధించిన విజయాలకు గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు.
రథోత్సవాన్ని ప్రారంభించే కంటే ముందు ఖురాన్‌లోని ఆయత్‌లను చదవడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్నో ఏళ్లుగా ఈ ఆనవాయితీని ఆలయ నిర్వాహకులు పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం కూడా రథం లాగడానికి ముందు మౌల్వీ సయ్యద్ సజ్జాద్ బాషా ఖురాన్ ఆయత్‌లను ఆలపించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘రథోత్సవం ప్రారంభించే ముందు ఖురాన్‌లోని శ్లోకాలు పఠించడం మా పూర్వీకుల నుంచి వస్తోన్న ఆచారం. హిందూ ముస్లిం సోదరభావానికి చిహ్నంగా ఉండే ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా నిర్వహించాము’ అని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఈసారి వేడుకల్లో ఓ వివాదం చెలరేగింది. ఈ ఏడాది ఖురాన్ పఠనం చేయకూడదు అంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాగే ముస్లిం వ్యాపారులు స్టాళ్లను ఏర్పాటు చేయకూడదనే వాదన కూడా తెరపైకి వచ్చింది. ఈ అంశం కాస్త వివాదంగా మారడంతో ఏటా అనవాయితీగా వస్తోన్న ఆచారాన్ని పాఠించాలని, ఖురాన్ పఠనాన్ని కొనసాగించాలని అర్చకుల కమిటీ నిర్ణయం తీసుకోవడంతో ఎప్పటిలాగే ఈసారి కూడా రథోత్సవం పూర్తయింది.
Also Read: Ram Charan-Urfi Javed: రామ్ చరణ్ కు పడిపోయిన.. బాలీవుడ్ శృంగార తార.. ఓపెన్ ఆఫర్ అంటూ ఇలా..
Ranveer singh: జిమ్ బాడీతో ట్రెండ్ సెట్టింగ్ లో బిజీగా బాలీవుడ్ కండల కాంతారావు రణవీర్ సింగ్…
Sridevi Shoban Babu : ‘శ్రీదేవి శోభన్ బాబు’ మూవీ నుంచి అందమైన మెలోడి సాంగ్..