భారత్-రష్యా రక్షణ ఒప్పందాలు.. పుతిన్ పర్యటన సందర్భంగా కొత్త అధ్యాయం..!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో జరుపుతున్న భారత్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతమవుతుందని అధికారిక సమాచారం. 2025 డిసెంబర్ 3న రష్యా పార్లమెంట్‌లోని లోయర్ హౌస్ రికర్సిప్రొకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ (RELOS) ఒప్పందాన్ని ఆమోదించడంతో ఈ సహకారం కొత్త దిశలో అడుగుపెట్టింది.

భారత్-రష్యా రక్షణ ఒప్పందాలు.. పుతిన్ పర్యటన సందర్భంగా కొత్త అధ్యాయం..!
Narendra Modi, Vladimir Putin

Edited By: Balaraju Goud

Updated on: Dec 04, 2025 | 8:13 AM

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో జరుపుతున్న భారత్ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతమవుతుందని అధికారిక సమాచారం. 2025 డిసెంబర్ 3న రష్యా పార్లమెంట్‌లోని లోయర్ హౌస్ రికర్సిప్రొకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్ (RELOS) ఒప్పందాన్ని ఆమోదించడంతో ఈ సహకారం కొత్త దిశలో అడుగుపెట్టింది. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల సైనిక బలగాలు, నౌకలు, విమానాల మధ్య లాజిస్టిక్ మద్దతు, ట్రూప్స్ ఎక్స్చేంజ్ సులభతరమవుతాయి.

రక్షణ చర్చలు కీలకం

ప్రధాని నరేంద్ర మోదీతో పుతిన్ డిసెంబర్ 5న జరిగే చర్చల్లో S-400 మిస్సైల్ సిస్టమ్‌ల అదనపు డెలివరీలు, Su-57 స్టెల్త్ ఫైటర్ జెట్‌ల కొనుగోళ్లు, S-500 అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి అంశాలు చర్చనీయాంశాల్లో ఉన్నాయి. 2018లో $5.4 బిలియన్ విలువైన S-400 ఒప్పందంలో ఇప్పటివరకు మూడు స్క్వాడ్రన్‌లు డెలివరీ అయ్యాయి. మిగిలిన రెండు స్క్వాడ్రన్‌ల డెలివరీని వేగవంతం చేయాలని భారత్ డిమాండ్ చేస్తోంది. 2025 మే నెలలో పాకిస్తాన్‌పై భారత్ నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ సమయంలో S-400 వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేసిందని భారత డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు.

Su-57 ఫైటర్ జెట్‌లపై చర్చలు జరుగుతున్నాయి. ఇది $35 మిలియన్ ధరతో అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్ కంటే తక్కువ ధరకు లభిస్తుంది. భారత్‌లోనే తయారీ, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌ను కోరుకుంటుంది. S-500 సిస్టమ్ భారత్ ఎయిర్ డిఫెన్స్‌ను మరింత బలోపేతం చేస్తుంది. ఇది బాలిస్టిక్ మిస్సైళ్లను సైతం గాల్లోనే పసిగట్టి మార్గమధ్యంలోనే ధ్వంసం చేయగలదు.

చారిత్రక నేపథ్యం

సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత (1991) భారత్-రష్యా మధ్య రక్షణ ఒప్పందాలు ఎక్కువగా జరిగాయి. భారతదేశ ఆయుధాల దిగుమతులలో 60%కు పైగా రష్యా నుంచే సరఫరా అవుతున్నాయి. ముఖ్యమైన ఒప్పందాలు:

ఒప్పందం వివరాలుః

Su-30MKI ఫైటర్ జెట్‌లుః 1996 లో 50 జెట్‌ల కొనుగోళ్లు, HALలో 140 లైసెన్స్ ప్రొడక్షన్ ద్వారా భారత వాయుసేన బలోపేతం.

BrahMos మిస్సైల్ః 1998 లో కీలక ఒప్పందం. భారత-రష్యా జాయింట్ వెంచర్, క్రూజ్ మిస్సైల్ ఉత్పత్తి ప్రారంభం. ఆధునిక రక్షణ వ్యవస్థలకు పునాది.

S-400 ట్రయుంఫ్ః 2018లో ఒప్పందం. 5 స్క్వాడ్రన్‌లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. $5.4 బిలియన్, పాక్‌తో జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో ప్రభావవంతంగా పనిచేసింది.

T-90 ట్యాంక్‌లుః 2001లో కుదురిన ఒప్పదం.. లైసెన్స్ ప్రొడక్షన్ . భారత సైన్య ఆర్మర్ మరమ్మత్తు.

AK-203 రైఫిళ్లుః 2019 లో కొనుగోళ్లు.. IRRPL ద్వారా ‘మేక్ ఇన్ ఇండియా’లో ఉత్పత్తి. 7.5 లక్షల రైఫిళ్లతో రక్షణ రంగం బలోపేతం.

2021-2031 మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ః

భారత్-రష్యా 2+2 డైలాగ్ సందర్భంగా సంతకం చేసిన ఈ ఒప్పందం R&D, ఉత్పత్తి, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్‌ను కవర్ చేస్తుంది. ఇందులో MiG-29 అప్‌గ్రేడ్, Kamov-31 హెలికాప్టర్‌లు, T-90 ట్యాంక్‌లు ఉన్నాయి.

US ఆంక్షలు, వ్యూహాత్మక అంశాలుః

US CAATSA శాంక్షన్లు S-400 ఒప్పందంపై ఆంక్షలు విధించినప్పటికీ, భారత్ తన వ్యూహాత్మక స్వతంత్రతను కాపాడుకుంటోంది. రష్యా-భారత్ వాణిజ్యం $68.7 బిలియన్‌కు చేరింది. 2030 నాటికి $100 బిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది. పుతిన్ పర్యటన ద్వారా రక్షణ, ఎనర్జీ, ట్రేడ్ రంగాల్లో 10 ఒప్పందాలు, 15కు పైగా కమర్షియల్ అగ్రిమెంట్లపై సంతకాలు జరగనున్నాయి.

ఈ ఒప్పందాలు భారత్ రక్షణ సామర్థ్యాన్ని పెంచుతాయి. అలాగే BRICS, SCO వంటి వేదికలపై సహకారాన్ని బలోపేతం చేస్తాయి. అయితే, US ఒత్తిడి మధ్య భారత్ తన ‘స్ట్రాటజిక్ ఆటానమీ’ని నిర్ధారించుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..