ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు.. కీలక నిర్ణయం తీసుకున్న పంజాబ్‌కు చెందిన కుటుంబం.. పెళ్లి వేడుకలో హుండీ ఏర్పాటు చేసి..

|

Dec 10, 2020 | 9:38 PM

రైతుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ఓ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. తమ కుమారుడి వివాహానికి వచ్చే వారు గిఫ్టులను తీసుకురావొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు.. కీలక నిర్ణయం తీసుకున్న పంజాబ్‌కు చెందిన కుటుంబం.. పెళ్లి వేడుకలో హుండీ ఏర్పాటు చేసి..
Follow us on

రైతుల ఆందోళన నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ఓ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. తమ కుమారుడి వివాహానికి వచ్చే వారు గిఫ్టులను తీసుకురావొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ గిఫ్టులకు బదులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతులకు విరాళాలు ఇవ్వాలని సూచిస్తు్న్నారు. వివరాల్లోకెళితే.. పంజాబ్‌లోని శ్రీముఖ్సర్ సాహిబ్ జిల్లాలో ఓ ఇంట్లో వివాహ వేడుక జరుగుతోంది. ఈ వేడుకకు హాజరయ్యే వారు బహుమతులు తీసుకురాగా, వాటిని సదరు కుటుంబ సభ్యులు తిరస్కరిస్తున్నారు. బహుమతులకు బదులుగా రైతుల కోసం విరాళాలు చెల్లించాలంటూ అక్కడ ఒక హుండీ లాంటిది ఒకదానిని ఏర్పాటు చేశారు. అలా సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు తమ వంతుగా సాయం చేద్దామంటూ పిలుపునిస్తున్నారు. రైతుల పోరాటం వారికి మాత్రమే సంబంధించినది కాదని, అందరి సమస్య అని ఆ కుటుంబం పేర్కొంటోంది. ‘ఇది మనందరి సమస్య.. అందరం కలిసి పోరాడుదాం’ అంటూ పెళ్లి కొడుకు అందరికీ పిలుపునిస్తున్నాడు. దీనికి సంబంధించి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వీరి నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు విమర్శలతో పాటు సెటైర్లు వేస్తున్నారు.