రానున్న నెలల్లో 50 వేలమంది సెంట్రల్ పోలీస్ డాక్టర్లకు కోవిడ్ వ్యాక్సిన్ , జాబితా త్వరలో సిధ్ధం

రానున్న నెలల్లో 50 వేలమంది సెంట్రల్ పోలీస్ డాక్టర్లకు మొదట కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. హోం శాఖ పర్యవేక్షణలో ఈ బృహత్తర వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వారి వారి యూనిట్ల..

రానున్న నెలల్లో 50 వేలమంది  సెంట్రల్ పోలీస్ డాక్టర్లకు కోవిడ్  వ్యాక్సిన్ , జాబితా త్వరలో సిధ్ధం
Covid-19 vaccine wastage
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 10, 2020 | 10:24 PM

రానున్న నెలల్లో 50 వేలమంది సెంట్రల్ పోలీస్ డాక్టర్లకు మొదట కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. హోం శాఖ పర్యవేక్షణలో ఈ బృహత్తర వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. వారి వారి యూనిట్ల నుంచి ఫ్రంట్ లైన్ మెడికల్ వర్కర్ల డేటాను రెడీ చేయాలని సెంట్రల్ ఫోర్స్ చీఫ్ లను ఈ శాఖ కోరింది. హోం కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. తొలి ప్రాధాన్యతా ప్రాతిపదికపై టీకామందు ఇస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. డాక్టర్లు, సీ ఏ పీ ఎఫ్ హెల్త్ వర్కర్లు, ఈ లిస్టులో ఉన్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. వీరికి ఎన్ని డోసుల వ్యాక్సిన్ ఇవ్వాలో ఆ వివరాలను కూడా అందజేయాలని అజయ్ భల్లా కోరినట్టు వెల్లడించాయి. ఈ ఆర్మీ యూనిట్ లో సుమారు 10 లక్షలమంది సిబ్బంది ఉన్నారు.