CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ..దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణమాలపై చర్చ

|

Dec 20, 2022 | 9:55 PM

ప్రగతి భవన్‌లో సమావేశమైన తెలంగాణ - పంజాబ్‌ సీఎంలు.. కేంద్ర వైఖరి, రాష్ట్రాల ఇబ్బందులపై చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన గులాబీ బాస్‌.. బీఆర్‌ఎస్ కార్యక్రమాలను వేగవంతం చేయబోతున్నారు.

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ..దేశంలో ప్రస్తుత రాజకీయ పరిణమాలపై చర్చ
Punjab Cm Meets Cm Kcr In Hyderabad
Follow us on

ముఖ్యమంత్రి కేసీఆర్ తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమై దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత దేశవ్యాప్తంగా దూకుడు పెంచాలని భావిస్తున్న కేసీఆర్‌తో.. పంజాబ్ సీఎం సమావేశం కావడం హాట్ టాపిక్‌గా మారింది. భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ కేంద్ర కార్యాల‌యాన్ని కేసీఆర్ ఢిల్లీలో ఈ మధ్యే ప్రారంభించారు. అప్పటినుంచి ప‌లు రాష్ట్రాల‌కు చెందిన ఆయా పార్టీల నాయ‌కులు, రైతు సంఘాల నేత‌లు కేసీఆర్‌తో స‌మావేశ‌మ‌వుతున్నారు.

ఈ క్రమంలోనే భగవంత్‌తో భేటీ అయిన కేసీఆర్‌ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న రైతు వ్యతిరేక నిర్ణయాలు, ఇత‌ర అంశాల‌పై చర్చించినట్టు సమాచారం. బీజేపీపై పోరాటం విష‌యంలో కేసీఆర్‌కు తనను కలుస్తున్న నేతలందరికీ మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు ఈ నెల 24న పంజాబ్‌ శాసనసభ స్పీకర్‌ సర్దార్‌ కుల్తార్‌ సింగ్‌ సంధ్వాన్‌ హైదరాబాద్‌ రానున్నారు.

నేషనల్ పాలిటిక్స్‌లో దూకుడు పెంచాలని డిసైడ్ అయ్యారు సీఎం కేసీఆర్. క్రిస్మస్ తర్వాత దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను స్పీడప్ చేసేలా ప్రణాళిక రచించారు. మరో పది రోజుల్లో బీఆర్ఎస్ విధివిధానాలు ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు.

జనవరి 1 నాటికి మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో కిసాన్ సెల్ కమిటీలను వేసేందుకు బీఆర్ఎస్ రెడీ అయింది. ఈ నెలాఖరులో ఢిల్లీలో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. అక్కడ ఎలాంటి అంశాలు వెల్లడిస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం