యానాం పర్యటనలో ఉన్న గవర్నర్ తమిళిసై క్లౌడ్ బరస్ట్ మాటలను కొట్టిపారేశారు. క్లౌడ్ బరస్ట్ వైన్ లాంటిందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ యానాంలోకి అనుమతించమని అన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో కేంద్రపాలిత ప్రాంతం యానాంలో లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై పర్యటన కొనసాగుతోంది. గోదావరిలో వచ్చింది క్లౌడ్ బరస్ట్ కాదని.. సాధారణంగా వచ్చే వర్షాలేనని..అయితే, ఈసారి వర్షాలు కొంచెం ఎక్కువ వచ్చాయని స్పష్టం చేశారు. యానాంలో వరద నియంత్రణకు దీర్ఘప్రణాళిక అమలు చేస్తామని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటించారు. గతంలోనే ఈ ప్రణాళికకు రూపకల్పన జరిగిందని, కాని అనివార్య కారణాలతో అది నిలిచిపోయిందని ఆమె తెలిపారు. తాము చాలా దూరంలో ఉన్నా పరిస్థితిని ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిశీలిస్తున్నామని తమిళిసై తెలిపారు.
వరద ఉధృతికి అతలాకుతలమైన యానాంలో ఇవాళ పర్యటించనున్నారు. ప్రధానంగా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తారు. బాధితులతో స్వయంగా మాట్లాడి వాళ్ల ఇబ్బందులు, అందుతున్న సహాయక చర్యల్ని అడిగి తెలుసుకోనున్నారు. గౌతమీనది ఉధృతితో యానాంలోని పలు కాలనీలు నీటమునిగాయి. నడుములోతు నీళ్లతో స్తానికులు ఇబ్బంది పడుతున్నారు. గోదావరికి చేరువలో ఉన్న దాదాపు 8 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. మరోవైపు సహాయక చర్యల్లో పాల్గొంటున్న మాజీ ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు.. బాధితులకు భోజనం అందిస్తున్నారు.
యానాంలో వరద నష్టాన్ని పరిశీలించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్‌తో పాటు పుదుచ్చేరి మంత్రులు కూడా యానాం వచ్చారు. అయితే..లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై పర్యటన సందర్భంగా వివాదం చోటుచేసుకుంది. యానాంలోని ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయం ముందు ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్, మాజీ మంత్రి, పుదుచ్చేరి అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఇరువర్గాల మధ్య పోలీసులు చెదరగొట్టారు. ప్రాంతీయ పాలనాధికారి కార్యాలయంలోకి లెఫ్టినెంట్ గవర్నర్ వెళ్తున్నప్పుడు, బయటకు వస్తున్నప్పుడు రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఆహార పంపిణీకి సంబంధించి బోట్ల విషయంలో రెండు వర్గాల మధ్య తగాదా చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ వాహనానికి అడ్డుగా వస్తున్న జనాలను పోలీసులు చెదరగొట్టారు.