కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఢిల్లీ లోధీ రోడ్డులోని తన అధికారిక బంగళాను గురువారం ఖాళీ చేశారు. ఆగస్టు 1 కల్లా దీన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం ఈ నెల మొదటితేదీన నోటీసు జారీ చేసింది. అయితే తనకు ఇఛ్చిన గడువుకు ముందే ఆమె ఈ నివాసాన్ని వీడుతున్నారు. సెంట్రల్ ఢిల్లీ లోని తమ కొత్త ఇంటిలో చేరే ముందు ఆమె కొన్ని రోజులు గురుగావ్ లోని ఇంటిలోనే ఉండనున్నారు. సెంట్రల్ ఢిల్లీలో ప్రియాంక గాంధీ నివసించబోయే భవనానికి నూతన హంగులు చేకూరుస్తున్నారు. 1997 నుంచి ఆమె లోధీ రోడ్డులోని బంగళాలో నివసిస్తూ వచ్చారు. అయితే ఆమెకు ఎస్ పీజీ భద్రతను ప్రభుత్వం ఉపసంహరించడంతో దీన్ని ఖాళీ చేయాలన్న సమాచారం అందింది.