Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి త‌ప్పిన ప్రమాదం.. యూపీలోని రాంపూర్‌కు వెళుతుండగా..

|

Feb 04, 2021 | 12:25 PM

priyanka gandhi convoy accident : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ వెళుతుండగా ఆమె కాన్వాయ్‌లోని..

Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి త‌ప్పిన ప్రమాదం.. యూపీలోని రాంపూర్‌కు వెళుతుండగా..
priyanka gandhi convoy accident
Follow us on

priyanka gandhi convoy accident : కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ప్రమాదం తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ వెళుతుండగా ఆమె కాన్వాయ్‌లోని నాలుగు కార్లు ఒకదానికొకటి ఢికొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా మరణించిన నవరీత్ సింగ్ అనే రైతు కుటుంబాన్ని పరామర్శించేందుకు గురువారం ఉదయం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ.. యూపీలోని రాంపూర్ నగరానికి బయలుదేరారు. ఈ క్రమంలో యూపీలోని హాపూర్ వద్ద ప్రియాంక గాంధీ కాన్వాయ్‌లోని నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రియాంక గాంధీతోపాటు ఆమె భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో కార్లు దెబ్బతిన్నాయి.

Also Read:

మరోసారి సామాన్యుడిపై గుదిబండ.. పెరిగిన గ్యాస్ ధర.. ఎంత పెరిగిందంటే..?

VK Sasikala: తమిళనాడులో వేడెక్కుతున్న రాజకీయాలు.. 7న చెన్నైకి రానున్న చిన్నమ్మ.. గ్రాండ్‌ వెల్‌కమ్‌‌కు సన్నాహలు..