Budget 2021: ఈ సారి బడ్జెట్‌లో ప్రైవేటీకరణ పాలసీ? సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌‌పై దృష్టి సారించిన కేంద్రం..

Budget 2021: ప్రభుత్వం అధిక ఆదాయం కోసం ఈ సారి బడ్జెట్‌లో ప్రైవేటీకరణ పాలసీకి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రభుత్వ రంగ సంస్థల్లో

Budget 2021: ఈ సారి బడ్జెట్‌లో ప్రైవేటీకరణ పాలసీ? సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌‌పై దృష్టి సారించిన కేంద్రం..

Edited By: Ram Naramaneni

Updated on: Jan 31, 2021 | 7:01 PM

Budget 2021: ప్రభుత్వం అధిక ఆదాయం కోసం ఈ సారి బడ్జెట్‌లో ప్రైవేటీకరణ పాలసీకి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ తదితర అంశాలపైనే ఎక్కువగా ఆధారపడనుంది. ప్రైవేటీకరణ పాలసీ బ్లూప్రింట్‌ను ఈ సారి ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కేబినెట్‌ సమావేశంలో పలు ప్రభుత్వ రంగాలను గుర్తించేలా ది న్యూ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ ప్రైజెస్‌పాలసీని ఆమోదించారు.

ఇదిలా ఉంటే మేలో ప్రకటించిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ కింద ప్రభుత్వం నాలుగు కంపెనీలను మాత్రమే వ్యూహాత్మక రంగంలోకి తీసుకొని మిగిలిన వాటిని ప్రైవేటీకరించే అవకాశం ఉంది. బడ్జెట్‌లో సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేటీకరణపై కేంద్రం దృష్టిసారించనుంది. ఇప్పటికే దాదాపు 249 సెంట్రల్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఉన్నాయి. జాతీయ, ప్రజా ప్రయోజనాలను తీర్చడంలో కీలకమైన వాటిని వ్యూహాత్మక రంగాల్లోకి చేర్చే అవకాశం ఉంది.

Budget 2021: కొత్త బడ్జెట్‌పై స్టార్టప్స్ కోటి ఆశలు.. ఇంతకీ వీరు ఏం కోరుకుంటున్నారంటే..