PM Modi Kushinagar Visit: కుశీనగర్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ..

కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు.

PM Modi Kushinagar Visit: కుశీనగర్ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ..
Pm Modi Inaugurated The Kus

Updated on: Oct 20, 2021 | 12:39 PM

కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ యాత్రా స్థలాలను ఈ కుషినగర్ విమానాశ్రయం అనుసంధానిస్తుంది. ఈ రోజు కుషినగర్‌లో ఒక వైద్య కళాశాలతోపాటు అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో సిఎం యోగి ఆదిత్యనాథ్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, గవర్నర్ ఆనంది బెన్, శ్రీలంక మంత్రి రాజపక్స సహా వందలాది మంది బౌద్ధ సన్యాసులు కూడా పాల్గొన్నారు.

కుశీనగర్ అనేది అంతర్జాతీయ బౌద్ధ తీర్థయాత్ర ప్రదేశం. ఇక్కడ గౌతమ బుద్ధుని మహాపరిణిణ జరిగింది. ఇది ఉత్తర ప్రదేశ్‌లో మూడో అంతర్జాతీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయంలో మొదటి విమానం శ్రీలంకలోని కొలంబో నుండి వచ్చింది. రూ .260 కోట్ల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించింది కేంద్రం. దీని టెర్మినల్ 3 వేల 600 చదరపు మీటర్లలో విస్తరించి ఉంది. కుషీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్ వే 3.2 కి.మీ పొడవు,  45 మీటర్ల వెడల్పు ఉంది. ఇది UP లో పొడవైన రన్ వే అని చెప్పవచ్చు. దీని రన్‌వేపై ప్రతి గంటకు 8 విమానాలను టేక్‌ఆఫ్ తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చే యాత్రికులు లుంబినీ, బోధ్ గయ, సారనాథ్, కుషినగర్‌ను సందర్శించవచ్చు. దీనితో పాటు శ్రావస్తి, కౌశాంబి, సంకిషా, రాజగిర్, వైశాలి వంటి యాత్ర ప్రదేశాలకు ఇక్కడి నుంచి తక్కువ సమయంలో ప్రయాణం చేయవచ్చు.

బౌద్ధ అనుచరుల కోసం: ప్రధాని మోడీ

భారతదేశం పూర్తిగా టీకాలు వేయబడిందని ప్రధాని మోడీ గుర్తు చేశారు. భారత్ వచ్చే పర్యాటకులకు ఆయన భరోసా ఇచ్చారు. భారత్ పూర్తి స్థాయిలో సురక్షితం అని పేర్కొన్నారు. బుద్ధ భగవానుడి నుండి జ్ఞానోదయం వరకు మహాపరినిర్వణానికి సాగిన మొత్తం ప్రయాణానికి ఈ ఎయిర్‌పోర్ట్ కేంద్రంగా మారుతుందని అన్నారు. ఈరోజు కూడా మహర్షి వాల్మీకి జయంతి కావడం సంతోషకరమైన సంఘటన అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి: LPG Gas Booking – WhatsApp: వాట్సాప్‌తో ఓ మెసెజ్‌ చేస్తే చాలు మీ LPG గ్యాస్ సిలిండర్ బుక్ అవుతుంది.. ఎలా చేయాలో తెలుసా..

Online Shopping: భారీ ఆఫర్లు ఉన్నాయని ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. అయితే ఈ ఐదు సంగతులు గుర్తుంచుకోండి..