PM Modi: ఆదివాసీలకు అండగా మేమున్నాం.. బిర్సా ముండా జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ

ఆదివాసీలకు తమ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రధాని మోడీ. బిర్సా ముండా జయంతి సందర్భంగా భోపాల్‌లో జన జాతీయ గౌరవ్‌ దివస్‌ వేడుకలకు..

PM Modi: ఆదివాసీలకు అండగా మేమున్నాం.. బిర్సా ముండా జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ
Pm Modi

Updated on: Nov 15, 2021 | 6:56 PM

ఆదివాసీలకు తమ ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ప్రధాని మోడీ. బిర్సా ముండా జయంతి సందర్భంగా భోపాల్‌లో జన జాతీయ గౌరవ్‌ దివస్‌ వేడుకలకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఆదివాసీల ఆరాధ్యదైవం బిర్సా ముండా జయంతి వేడుకలకు హాజరయ్యారు ప్రధాని మోడీ. మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. జనజాతీయ గౌరవ్‌ దివస్‌ పేరుతో కేంద్రం బిర్సా ముండా జయంతి వేడుకలను నిర్వహిస్తోంది. రాణి కమలాపతి వరల్డ్‌ క్లాస్‌ రైల్వే స్టేషన్‌ను కూడా ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్‌లో ఉండే వసతులన్నీ ఈ రైల్వేస్టేషన్‌లో ఉండేలా తీర్చిదిద్దారు. 50 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను కూడా ప్రారంభించారు మోడీ.

రేషన్‌ ఆప్‌ కే గ్రామ్‌.. ఇంటి దగ్గరకే రేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు జార్ఖండ్‌ రాజధాని రాంచిలో ఏర్పాటు చేసిన బిర్సా ముండా ట్రైబల్‌ మ్యూజియాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు మోడీ. జార్ఱండ్‌ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వాలు ఆదివాసీలను చిన్నచూపు చూశాయని విమర్శించారు.

చరిత్రలో ఆదివాసీ నేతలకు తగిన గుర్తింపు లభించలేదన్నారు. గుజరాత్‌లో తాను రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఈవిషయాన్ని ప్రస్తావిస్తునట్టు తెలిపారు మోడీ. రైతులపై కాంగ్రెస్‌ పార్టీ మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శించారు మోడీ.

కాంగ్రెస్‌ పాలనలో కనీస మద్దతు ధరపై ఎప్పుడు మాట్లాడలేదన్నారు. ఆదివాసీలకు తమ ప్రభుత్వం అన్నివిధాలా న్యాయం చేస్తుందన్నారు. ఆదివాసీ ప్రాంతాలను తమ ప్రభుత్వం అన్నివిధాలా అభివృద్ది చేస్తుందని చెప్పారు.

ఇవి కూడా చదవండి: AP Municipal Elections: కుప్పంలో ఏం జరిగిందంటే.. వీడియోలను విడుదల చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి

Malaika Arora: హీరోయిన్ చెంపలు పట్టుకుని లాగిన బాలుడు.. షాక్‏లో మలైకా.. చివరకు ఏం చేసిందంటే..