
యువత క్రీడలపై దృష్టి సారించి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాక్షించారు. క్రీడల్లో కొనసాగేందుకు యువతను కేంద్రం ప్రోత్సహిస్తోందన్నారు. భారత యువతకు సాధ్యం కానిది ఏది లేదన్న ప్రధాని.. జైపూర్ మహాఖేల్ క్రీడా ప్రతిభకు ఒక వేడుక అని కొనియాడారు. ఖేల్ మహాకుంభ్ వంటి కార్యక్రమాలు క్రీడా ప్రతిభను బయటకు తీసేందుకు ఉపయోగపడతాయన్నారు ప్రధాని మోడీ. దేశం 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంటున్న తరుణంలో కొత్త వ్యవస్థలను నిర్మిస్తోందన్నారు. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్(టాప్) వంటి అవిష్కరణలు యువతకు ముఖ్యమైన క్రీడా ఈవెంట్లలో పాల్గొనేందుకు ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు. క్రీడాకారులకు పోషకాహారం చాలా ముఖ్యమని, అంతర్జాతీయ తృణ ధాన్యాల సంవత్సరాన్ని పురస్కరించుకుని యువత దానిని ప్రమోట్ చేయాలని కోరారు.
క్రీడలకు బడ్జెట్ కేటాయింపులు మూడింతలు పెరిగాయి. కేవలం ఖేలో ఇండియాకే రూ.1000 కోట్లు కేటాయించాం. క్రీడా వస్తువులను అందివ్వడం ద్వారా క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మీలో ఉన్న వారే దేశానికి పతకాలు తీసుకువస్తారు. ఫిట్‌గా ఉన్న మీరందరూ సూపర్‌హిట్ అవుతారు. మకర సంక్రాంతి రోజున రాజస్థాన్‌లో బాల్-దాదా ఆడినా, సిటోలియా, కబడ్డీ ఆడినా అవి చాలా కాలంగా ప్రచారంలో ఉన్నాయి. ఆటల్లో అమ్మాయిలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా అభినందనీయం.
– ప్రధాని మోడీ..
आप फिट होंगे, तभी सुपरहिट होंगे!
इसके लिए युवा खिलाड़ियों से मेरा एक विशेष आग्रह… pic.twitter.com/I40JrSEsKu
— Narendra Modi (@narendramodi) February 5, 2023
జైపూర్ రూరల్ ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్.. జనవరి 15 నుంచి జైపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో మహాఖేల్‌ను ప్రారంభించారు. ఇందులో 630 జట్లు పాల్గొన్నాయి. కోట్‌పుట్లీ, బన్సూర్, జామ్‌వరంగఢ్, జోత్వారా, విరాట్ నగర్, అమెర్, షాపురా, ఫూలేరా అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 32 క్రీడా మైదానాల్లో 512 పురుషులు, 128 మహిళల జట్లు పాల్గొన్నాయి. 6 వేల మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..