Modi Birthday Special : ప్రధాని పుట్టినరోజుకు రెస్టారెంట్ బంపర్ ఆఫర్.. రూ. 8.5లక్షలు గెలుచుకునే ఛాన్స్.. ఇంకా..

మరోవైపు సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 26వరకు దేశవ్యాప్తంగా మోడీ పుట్టిన రోజు కార్యక్రమాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు వెయ్యి మందికి పైగా హాజరుకానున్నారు.

Modi Birthday Special : ప్రధాని పుట్టినరోజుకు రెస్టారెంట్ బంపర్ ఆఫర్.. రూ. 8.5లక్షలు గెలుచుకునే ఛాన్స్.. ఇంకా..
56inch Modi Ji Thali

Updated on: Sep 16, 2022 | 1:10 PM

Modi Birthday Special : సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా…మోడీ అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు పెద్ద ఎత్తున సన్నాహలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఢిల్లీలోని ఓ రెస్టారెంట్ రుచికరమైన థాలీని అందించేందుకు రెడీ అయ్యింది. రెస్టారెంట్ యజమాని సుమిత్ర కల్రా ఏకంగా థాలీకి 56 అంగుళాల మోడీజీ అని పేరు పెట్టారు. మోడీ పుట్టిన రోజు సందర్భంగా రుచికరమైన వంటకాలు సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. మోడీ అంటే తమకు ఎంతో గౌరవమనిచెప్పారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా రెస్టారెంట్ తరపున బహుమతి అందజేస్తామని తెలిపారు.

మోడీ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆయా తేదీల మధ్య తమ రెస్టారెంట్లో ఫుడ్ తినే కస్టమర్లు 8లక్షల రూపాయల విలువచేసే ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉందని బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. 56 అంగుళాల మోడీజీ థాలీని దంపతుల్లో ఎవరైనా 40 నిమిషాల్లో ఈ థాలీని పూర్తి చేస్తే వారికి రూ.8.5 లక్షలు బహుమతిగా అందజేస్తామన్నారు. అలాగే, సెప్టెంబరు 17-26 మధ్య మా రెస్టారెంట్‌ని సందర్శించి బహుమతి గెలుచుకున్నవారికి కేథార్ నాథ్, ఛార్ దామ్ యాత్రకు పంపించనున్నట్లు రెస్టారెంట్ యజమాని తెలిపారు.

మరోవైపు సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 26వరకు దేశవ్యాప్తంగా మోడీ పుట్టిన రోజు కార్యక్రమాలు జరగనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు వెయ్యి మందికి పైగా హాజరుకానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి