Mamata Banerjee: అందుకే ద్రౌపది ముర్ముకు ఛాన్స్.. బీజేపీ వలలో చిక్కుకున్న మమతా బెనర్జీ..!

విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో పోలిస్తే అధికార భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి కావడానికి అవకాశం ఉందని మమతా బెనర్జీ వారం క్రితం ఒప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Mamata Banerjee: అందుకే ద్రౌపది ముర్ముకు ఛాన్స్.. బీజేపీ వలలో చిక్కుకున్న మమతా బెనర్జీ..!
Mamata Banerjee
Shaik Madarsaheb

|

Jul 04, 2022 | 9:59 PM

Mamata Banerjee gets trapped in BJP: రాష్ట్రపతి ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీ నాయకురాలు ద్రౌపది ముర్ము ఎంపికయ్యారు. అయితే.. ద్రౌపది ముర్ము ఎంపికతో త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ వలలో చిక్కుకున్నట్లు కనిపిస్తుంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాతో పోలిస్తే అధికార భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారత రాష్ట్రపతి కావడానికి అవకాశం ఉందని మమతా బెనర్జీ వారం క్రితం ఒప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా ఎంపికతో ఆయన బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేయవలసి వచ్చింది. అయితే.. బీజేపీ తమ అభ్యర్థిగా గిరిజన మహిళను పోటీకి దింపుతామని చెప్పి ఉంటే, ఆమె పేరుపై ఏకాభిప్రాయం ఏర్పడి ఉండేదని మమతా బెనర్జీ చెప్పడంతో సందిగ్ధత నెలకొంది.

జులై 18న జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాల మధ్య పోటీ నెలకొంది. అయితే.. ఎన్డీఏ అభ్యర్థి ఎంపిక బెనర్జీకి ఆందోళనకరంగా మారింది. ఇది పశ్చిమ బెంగాల్ రాజకీయాలపై.. ముఖ్యంగా 2024 లోక్‌సభ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశముందని వ్యాసకర్త అజయ్ ఝా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన న్యూస్‌9కి ప్రత్యేక వ్యాసం రాశారు.

2011 జనాభా లెక్కల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌లో 5.8 శాతం గిరిజన జనాభా ఉంది. ఇది ఇప్పుడు ఏడు నుంచి ఎనిమిది శాతానికి పెరిగే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో గిరిజన జనాభా దాదాపు 25 శాతంగా ఉంది. రాష్ట్రంలోని గిరిజన జనాభాలో దాదాపు 80 శాతం మంది ద్రౌపది ముర్ముకు చెందిన సంతాల్ తెగకు చెందినవారు ఉన్నారు.

జార్ఖండ్ సరిహద్దులో ఉన్న జంగల్ మహల్ ప్రాంతంలోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాలలో అధిక సంఖ్యలో గిరిజన జనాభా కనిపిస్తుంది. నాలుగు లోక్‌సభ స్థానాలు.. బంకురా, పురూలియా, పశ్చిమ మిడ్నాపూర్, ఝర్‌గ్రామ్‌లు జంగల్ మహల్ ప్రాంతంలో అత్యధికమంది గిరిజనులు ఉన్నారు.

ఉత్తర బెంగాల్‌లోని డార్జిలింగ్, కాలింపాంగ్, అలీపుర్‌దువార్, జల్‌పైగురి, కూచ్ బెహార్, నార్త్, సౌత్ దినాజ్‌పూర్, మాల్దా అనే ఎనిమిది లోక్‌సభ నియోజకవర్గాలలో కూడా గిరిజన జనాభా సాపేక్షంగా ఎక్కువగా ఉంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ 22, బీజేపీ 18 స్థానాలను గెలుచుకున్నాయి. అయితే.. ఈ రెండు ప్రాంతాలలో బీజేపీ చాలా మంచి పనితీరు కనబరిచింది.

2021 అసెంబ్లీ ఎన్నికలలో, తృణమూల్ కాంగ్రెస్.. బీజేపీ వ్యూహాలను దెబ్బకొట్టి ఆ ప్రాంతాలను చేజిక్కించుకోగలిగింది.

అయినప్పటికీ, 2024 ఎన్నికలలో వారి మద్దతు కొనసాగుతుందని హామీ ఇవ్వలేము.. ఎందుకంటే దేశం మొట్టమొదటి గిరిజన రాష్ట్రపతిగా అవతరించనున్న తోటి సంతాల్ ముర్ముకు వ్యతిరేకంగా ఓటు వేయడం వలన ప్రమాదం పొంచి ఉందని స్పష్టమవుతోంది. దీంతో మమతా బెనర్జీ ప్రధాన మంత్రి ఆశయాలు, కలలు అలానే మిగిలిపోతాయి.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షాలు బీజేపీని ఓడించగలిగితే, ఆమె రాష్ట్రం నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవడం.. ఆమె అవకాశాలకు కీలకంకానుంది.

ద్రౌపది ముర్ము ప్రభావాన్ని ఎదుర్కొన్న వారిలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రమే కాదు. పొరుగున ఉన్న జార్ఖండ్‌లో సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కూడా ఉంది. ముర్ముకు లేదా సిన్హాకు ఓటు వేయాలా అనే దానిపై JMM తన నిర్ణయాన్ని ఆలస్యం చేస్తూ బీజేపీ వ్యూహంలో చిక్కుకుపోయింది.

2000 సంవత్సరంలో ఏర్పడిన జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ రెండు రాష్ట్రాలలో అధిక సంఖ్యలో గిరిజన జనాభా ఉన్నాయి.

ఆదివాసీలలో గట్టి బలం ఉన్న JMM.. మొట్టమొదటిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన ముర్ము.. లేదా జార్ఖండ్‌కు చెందిన సిన్హాకు ఓటేయాలా అనే విషయంపై ఒక క్లారిటీకి రాలేదు..

తృణమూల్ కాంగ్రెస్, JMM రెండూ కూడా సిన్హాను తమ ఉమ్మడి అభ్యర్థిగా పేర్కొన్న ప్రతిపక్ష సమావేశంలో భాగంగా ఉన్నాయి. బెనర్జీ చొరవతో ప్రతిపక్షాలు ఒక్కతాటిపైకి వచ్చాయి.

తదుపరి రాష్ట్రపతి పదవికి గిరిజన మహిళను ఎంపిక చేయడం ద్వారా బిజెపి ఈ రెండు ప్రాంతీయ పార్టీలను ఇరుకున పెట్టింది.

పశ్చిమ బెంగాల్‌ను విభజించాలనే డిమాండ్‌పై బెనర్జీ ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉత్తర బెంగాల్‌లో బీజేపీ మద్దతు ఉంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఉంటామని తృణమూల్ కాంగ్రెస్ స్పష్టం చేయడంతో పాటు ముర్మును గెలిపిస్తామని హామీ ఇవ్వడంపై బెనర్జీని గిరిజన వ్యతిరేక నాయకురాలిగా చిత్రీకరించేందుకు బీజేపీ వ్యూహం రచించింది. పశ్చిమ బెంగాల్‌లోని గిరిజనుల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను సందర్శించడంలో కూడా ఆ పార్టీ నాయకులు పట్టు కోల్పోతున్నారు.

మమతా బెనర్జీ తెలివైన రాజకీయ నాయకురాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా వెళ్లడం ద్వారా లేదా ముర్ముకు వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా బెంగాల్‌లో పట్టును కోల్పుతున్నారనేది వాస్తవం.. రాష్ట్రంలోని గిరిజన జనాభా ఆమెను మున్ముందు స్వాగతిస్తుందా..? ప్రధానమంత్రి అవకాశాలు ఎలా ఉంటాయనేది ప్రశ్నార్థకంగా మారింది.

Source Link

ఇవి కూడా చదవండి

జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu