రెండేళ్ల బాలికను చిదిమేసిన దుర్మార్గుడిని ఉరి తీయాల్సిందే.. క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి

2012లో మహారాష్ట్రలో రెండేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ కేసులో దోషిగా తేలిన వ్యక్తి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. జూలై 25, 2022న పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి తిరస్కరించిన మూడవ క్షమాభిక్ష పిటిషన్ ఇది..!

రెండేళ్ల బాలికను చిదిమేసిన దుర్మార్గుడిని ఉరి తీయాల్సిందే.. క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి
President Of India Droupadi Murmu

Updated on: Dec 14, 2025 | 5:25 PM

2012లో మహారాష్ట్రలో రెండేళ్ల బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. ఈ కేసులో దోషిగా తేలిన వ్యక్తి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. జూలై 25, 2022న పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి తిరస్కరించిన మూడవ క్షమాభిక్ష పిటిషన్ ఇది..!

అక్టోబర్ 3, 2019న నిందితుడు రవి అశోక్ ఘుమారేకు విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. రవి అశోక్ ఘుమారేకు తన లైంగిక కోరికలపై నియంత్రణ లేదని, తన వాంఛలను తీర్చుకోవడానికి అన్ని సహజ, సామాజిక, చట్టపరమైన సరిహద్దులను దాటాడని కోర్టు పేర్కొంది. జస్టిస్ సూర్యకాంత్ (ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తి) నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తన తీర్పులో, ఆ వ్యక్తి పసిమొగ్గలారని చిన్నారి జీవితాన్ని దారుణంగా చిదిమేసినట్లు పేర్కొంది. రెండేళ్ల బాలికపై అసహజ నేరాలకు పాల్పడిన అతని చర్య నీచమైన, వికృత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపింది. క్రూరత్వం, భయంకరమైన చర్యలకు పాల్పడ్డ నిందితుడికి సరియైన శిక్ష అని ధర్మాసనం పేర్కొంది.

అయితే, అశోక్ ఘుమారే క్షమాభిక్ష పిటిషన్‌ను నవంబర్ 6, 2025న రాష్ట్రపతి తిరస్కరించారు. బాధితురాలు కేవలం రెండేళ్ల బాలిక అని, ఆమెను అప్పీలుదారు అపహరించి, ఆమె చనిపోయే వరకు నాలుగు నుండి ఐదు గంటలు వేధింపులకు గురిచేశారని పేర్కొన్నారు. బిడ్డకు తండ్రి ప్రేమ, ఆప్యాయత, సమాజంలోని చెడుల నుండి రక్షణ కల్పించడానికి బదులుగా, ఆమెను లైంగిక వాంఛకు గురిచేశాడని పేర్కొంది. ఇది ద్రోహం, సామాజిక విలువలకు అవమానకరమైన కేసు అని తీర్పు పేర్కొంది. రెండేళ్ల బాలికతో అసహజ లైంగిక దాడి వికృత మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుందని వెల్లడించింది.

ఈ సంఘటన మార్చి 6, 2012న మహారాష్ట్రలోని జల్నాలోని ఇందిరా నగర్ ప్రాంతంలో జరిగింది. రవి అశోక్ ఘుమారే బాధితురాలికి చాక్లెట్లతో ప్రలోభపెట్టి, ఆపై ఆమెను తన కామానికి గురిచేశాడు. ఫలితంగా 2 ఏళ్ల బాలిక మరణించింది. రవి అశోక్‌ను దిగువ కోర్టు దోషిగా నిర్ధారించింది. సెప్టెంబర్ 16, 2015న మరణశిక్ష విధించింది. అతని మరణశిక్షను బాంబే హైకోర్టు 2016 జనవరిలో సమర్థించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా అతని క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించారు. దీంతో అతనికి మరణ దండన ఖాయమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..