Mayawati: పుకార్లను నమ్మకండి.. రాష్ట్రపతి పదవిపై మాయావతి సంచలన వ్యాఖ్యలు..

|

Mar 28, 2022 | 5:30 AM

BSP Chief Mayawati: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పదవి కోసం బీజేపీ సహా ఏ పార్టీ

Mayawati: పుకార్లను నమ్మకండి.. రాష్ట్రపతి పదవిపై మాయావతి సంచలన వ్యాఖ్యలు..
Mayawati
Follow us on

BSP Chief Mayawati: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి పదవి కోసం బీజేపీ సహా ఏ పార్టీ తనకు ఆఫర్‌ చేసినా తీసుకోబోనంటూ ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రపతి పదవి కోసం ఏ పార్టీ నుంచైనా అలాంటి ప్రతిపాదనలను వస్తే తాను ఎప్పటికీ అంగీకరించబోనని మాయావతి పేర్కొన్నారు. తన మద్దతుదారులను తప్పుదోవ పట్టించేందుకే బీజేపీ, ఆరెస్సెస్ ఈ తప్పుడు ప్రచారం చేశాయని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీని గెలిపిస్తే మాయావతిని రాష్ట్రపతిని చేస్తానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆదివారం తొలిసారిగా మాట్లాడారు. ఘోర పరాజయంపై ఆఫీస్ బేరర్లు, ముఖ్య కార్యకర్తలు, మాజీ అభ్యర్థులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె ప్రసంగించారు. నాలుగుసార్లు యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయావతి .. ఎన్నికల్లో బీఎస్పీని బలహీనపరిచేందుకు బీజేపీ పక్కా ప్రణాళికతో పని చేసిందని అన్నారు. గతంలో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం సైతం అత్యున్నత పదవిని తిరస్కరించిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.

ఒకవేళ రాష్ట్రపతి పదవిని అంగీకరిస్తే అక్కడితో మన పార్టీ అంతమైనట్లేనని..మాయావతి పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీ ప్రభుత్వం ఏర్పడకపోతే బెహన్‌జీ మాయవతిని రాష్ట్రపతిని చేస్తామని పలువురు ప్రచారం చేశారని.. దీంతో వారికే ప్రజలు అధికారం కట్టబెట్టారంటూ మాయావతి పేర్కొన్నారు. రాష్ట్రపతి పదవి అనేది తన కలలో కూడా ఊహించని అంశమంటూ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బీఎస్పీ బలోపేతం మరింత కృషి చేస్తానని.. అనుక్షణం పార్టీ కోసమే పనిచేస్తానని మాయావతి చెప్పారు. పుకార్లను నమ్మవద్దని.. యూపీలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యకర్తలు కష్టపడాలని సూచించారు. కాగా.. యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాలకుగానూ బీఎస్పీకి కేవలం 1 సీటు మాత్రమే గెలిచింది. అంతకుముందు 2017 ఎన్నికల్లో బీఎస్పీ 19 స్థానాల్లో విజయం సాధించింది.

ఇదిలాఉంటే.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం జులై 24 తో ముగియనుంది. దీంతో జూన్ నెలలో రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగే అవకాశం ఉంది.

Also Read:

BJP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఏపీ, తెలంగాణల్లో యూపీ ఫార్ములా..

PM Modi: మన్‌ కీ బాత్‌‌లో మెట్ల బావి ముచ్చట.. ప్రధాని మోడీ నోట ఆ వివరాలు..