మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని ఆయన అన్నారు. ఇటీవల పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి ముందు నిలిపి ఉంచిన వాహనంలో ప్రమాదకరమైన జిలెటిన్ స్టిక్స్ కనబడడం, ఈ కేసులో సస్పెండయిన పోలీసు అధికారి సచిన్ వాజే పాత్ర ఉన్నట్టు నిర్ధారణ కావడం, ఆయనను ఎన్ఐఏ అరెస్టు చేసి విచారించడం వంటి పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ఇదంతా చూస్తుంటే ఈ వ్యవహారంలో బలమైన కుట్ర ఏదో ఉన్నట్టు అనుమానించాల్సి వస్తోందన్నారు. దేశంలో బడా పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ సంస్థలో వేలాది ఉద్యోగులు పని చేస్తుంటారని, అలాంటిది అక్కడ నిర్మానుష్య ప్రదేశంలో ఈ అనుమానాస్పద వాహనం కనబడడం, ఈ వాహన యజమాని మాన్ సుఖ్ హీరేన్ మృతి వంటి ఘటనలను కూడా అథవాలే గుర్తు చేశారు. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ కలిగిఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత గల ఈ విధమైన ఘటనలను హ్యాండిల్ చేయడంలో విఫలమైందని రామదాస్ అథవాలే ఆరోపించారు.
ఇలా ఉండగా థానేలో మాన్ సుఖ్ హీరేన్ మృతి చెందిన ప్రదేశంలోనే శనివారం మరో మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఇతడిని 48 ఏళ్ళ షేక్ సలీం అబ్దుల్ గా గుర్తించారు. అయితే ఇది అనుమానాస్పద ఘటన కాదని, ఇతడొక కూలీ అని భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. చుట్టూ పొదలు, కాలువ గల ఈ ప్రాంతంలో ఈ వ్యక్తి లోతైన కాలువలోజారి పడి ఉండవచ్చునని. ఇతని మృత దేహాన్ని ఆటాప్సీ కోసం ఆసుపత్రికి తరలించామని వారు చెప్పారు. సచిన్ వాజే ఉదంతం సెన్సేషనలైజ్ కావడం, పైగా ఇదే చోట షేక్ మృతదేహం కూడా కనబడడంతో ఈ కేసు కాస్త మిస్టరీగా మారింది. ఇప్పటికే సచిన్ వాజెని ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని చదవండి ఇక్కడ :మార్స్ పై నీటిజాడ..గురించి సంచలన నిజాలు వెల్లడించిన నాసా : water on Mars Video
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్నేక్ ఐలాండ్ వీడియో…ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలు : Snake Island Videoఆర్ ఆర్ ఆర్ మరో సినిమా..ఆసక్తికరంగా మారిన ప్రకటన :Paired Opposite Jr NTR In RRR Video.