వ్యాక్సిన్ టైమ్: రేపట్నించే వ్యాక్సిన్ పంపిణీ.. చేయాల్సినవివే.. చేయకూడనివి చేస్తే అంతే!

|

Jan 15, 2021 | 1:40 PM

కోవిడ్ వ్యాక్సిన్‌కు నియమ నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. ఈ నెల 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ సమయంలో పాటించే..

వ్యాక్సిన్ టైమ్: రేపట్నించే వ్యాక్సిన్ పంపిణీ.. చేయాల్సినవివే.. చేయకూడనివి చేస్తే అంతే!
Follow us on

Vaccination Guidelines : కోవిడ్ వ్యాక్సిన్‌కు నియమ నిబంధనలను కేంద్రం విడుదల చేసింది. ఈ నెల 16 నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ సమయంలో పాటించే నిబంధనలు, చేయాల్సినవి.. చేయకూడనివి చెబుతూ కేంద్రం అన్ని రాష్ట్రాలకు రూల్‌బుక్‌‌ను పంపించింది. 18ఏళ్లు పైబడిన వారికే టీకా ఇవ్వాలని, గర్భిణీలు, బాలింతలకు వ్యాక్సిన్‌ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు రాసిన లేఖల్లో ఆ వివరాలను వెల్లడించింది.

ఇవి తప్పకుండా…

  • Interchangeability fo Covid-19 Vaccines : కరోనా వ్యాక్సిన్లకు మార్చుకునేందుకు అనుమతి ఉండదు. తొలి డోసు ఏ సంస్థకు చెందిన టీకా తీసుకుంటారో.. రెండో డోసు కూడా అదే సంస్థకు చెందిన టీకా తీసుకోవాలి.

  • Person with History of : యాంటీబాడీలు లేదా ప్లాస్మా చికిత్స తీసుకున్న కరోనా రోగులు.. ఇతర జబ్బుల కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, ఆసుపత్రుల్లో చికిత్స పొందే రోగులకు వారు కోలుకున్న నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాతే కొవిడ్‌ టీకా ఇవ్వాలి.

  • Authorized Age Group : కచ్చితంగా 18ఏళ్ల పైబడిన వారికే వ్యాక్సినేషన్‌ ఇవ్వాలి. ఒకవేళ ఇతర టీకాలు తీసుకోవాల్సిన అవసరం వస్తే కొవిడ్‌ టీకాకు, వాటికి కనీసం 14 రోజుల వ్యవధి ఉండాలి.

    టీకా తీసుకునే వ్యక్తులకు మందులు, టీకా, ఆహార పదార్థాల అలర్జీ ఉందేమో తెలుసుకోవాలి. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.

  • Pregnancy and Lactation : గర్భిణీలు, పాలిచ్చే తల్లులపై ఇప్పటివరకు కొవిడ్‌ టీకా క్లినికల్‌ పరీక్షలు జరగలేదు… అందువల్ల ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో ఉన్న మహిళలకు టీకా ఇవ్వకూడదు.

  • టీకా తీసుకున్న తర్వాత ఏదైనా నొప్పి లేదా బాధగా అనిపిస్తే పారాసిటమల్‌ తీసుకోవచ్చు అని ఆరోగ్యశాఖ లేఖలో వెల్లడించింది.

  • సందేహాలను నివృత్తి కోసం 1075 టోల్‌ ఫ్రీ నెంబరు కూడా ఏర్పాటు చేశారు.

దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో శనివారం (జనవరి16) నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానుంది. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

తొలి రోజు 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా పంపిణీ చేయనున్నారు. వ్యాక్సిన్‌ పంపిణీపై తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు వీలుగా ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

ఈ కింది నిబంధనలు గుర్తుంచుకోవాలి..