Prashant Kishor: ఆ జాతీయ పార్టీలో జేడీయుని విలీనం చేయండి.. నితీశ్‌కు ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహా..

బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం కుర్చీ ఇచ్చేందుకు ముందుకు వచ్చినా తాను నితీశ్ కుమార్ కోసం పనిచేయబోనంటూ రెండ్రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Prashant Kishor: ఆ జాతీయ పార్టీలో జేడీయుని విలీనం చేయండి.. నితీశ్‌కు ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహా..
Prashant Kishor, Nitish Kumar (File Photo)

Updated on: Oct 08, 2022 | 6:25 PM

బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. సీఎం కుర్చీ ఇచ్చేందుకు ముందుకు వచ్చినా తాను నితీశ్ కుమార్ కోసం పనిచేయబోనంటూ రెండ్రోజుల క్రితం ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ప్రశాంత్ కిషోర్‌పై నితీశ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రశాంత్ కిషోర్ బీజేపీ కోసం పనిచేస్తున్నాడని ఆయన ఆరోపించారు. జేడీయుని రాజకీయంగా సమాధి చేయాలని ప్రశాంత్ కిషోర్ కుట్రపన్నారని ధ్వజమెత్తారు. అందుకే జేడీయును కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని తనకు ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చినట్లు వెల్లడించారు.

ఇటీవల తనతో ప్రశాంత్ కిషోర్ భేటీ కావడంపై స్పందించిన నితీశ్ కుమార్.. ప్రశాంత్ కిషోర్ అభ్యర్థన మేరకే ఈ భేటీ జరిగినట్లు చెప్పుకొచ్చారు. ఈ భేటీపై ఇది వరకే స్పందించిన ప్రశాంత్ కిషోర్.. నితీశ్ పిలుపు మేరకే తాను వెళ్లి ఆయన్ను కలిసినట్లు తెలిపారు. పార్టీకి (జేడీయూ) సారథ్యంవహించేందుకు ముందుకు రావాలని నితీశ్ తనను ఆహ్వానించారని.. అయితే దీనికి తాను నిరాకరించినట్లు చెప్పారు.  సీఎం కుర్చీ ఇచ్చేందుకు ఆయన ముందుకు వచ్చినా తాను నితీశ్ కోసం పనిచేయబోనని ప్రశాంత్ కిషోర్ స్పష్టంచేశారు.

లాలూని వెనకేసుకొచ్చిన నితీశ్ కుమార్..

ఇవి కూడా చదవండి

కాగా జాబ్ స్కామ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేయడంపై నితీశ్ కుమార్ స్పందించారు. లాలూ ప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల క్రితం ఆర్జేడీతో తాము తెగతెంపులు చేసుకున్నామని.. అయితే ఈ కేసులో ఎమీ జరగలేని వ్యాఖ్యానించారు. తాను కేసుకు సంబంధించి అంతా చూశానని.. అక్కడేమీ లేదంటూ వ్యాఖ్యానించారు. బీజేపీతో తాము కలిసి లేనందునే.. ఇప్పుడు మళ్లీ ఆ కేసును తిరగదోడుతున్నారని ఆరోపించారు. వారి ఏమైనా చేస్తారు.. మనం చేయగలిగింది ఏముందని వ్యాఖ్యానించారు.

పీకే ఎవరి కోసం పనిచేస్తున్నారు..?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీహార్‌ జేడీయు కోసం పనిచేస్తున్నట్లు బీహార్ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. నితీశ్ కుమార్‌తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ ఆ మేరకు లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని అనుమానం వ్యక్తంచేస్తున్నారు.  అయితే ప్రశాంత్ కిషోర్ బీజేపీలో కోసం పనిచేస్తున్నారని జేడీయు నేతలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో చేపడుతున్న పాదయాత్ర వెనుక బీజేపీ ఉందని అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ పాదయాత్రకు ప్రశాంత్ కిషోర్‌కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఐటీ శాఖ, ఈడీ, సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదు? అంతా కేంద్రం అండదండలు ఆయనకు ఉండటమే కారణమని అభిప్రాయపడుతున్నారు. బీహార్‌లో నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్న ప్రశాంత్ కిషోర్.. జాతీయ స్థాయిలో నిరుద్యోగ సమస్యపై కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి