Rat Murder Case: ఎలుక హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. పోస్టుమార్టంలో బయటపడ్డ అసలు విషయాలు..

|

Dec 02, 2022 | 9:44 AM

నిందితుడు ఎలుక తోకను రాయికి కట్టి కాలువలో పడవేసాడని, ఆ తర్వాత అటుగా వెళుతున్న జంతు ప్రేమికుడు వికేంద్ర శర్మ ఎలుకను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, ఆ ఎలుక చనిపోయిందని ఆరోపణలు వచ్చాయి.

Rat Murder Case: ఎలుక హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. పోస్టుమార్టంలో బయటపడ్డ అసలు విషయాలు..
Rat Murder Case
Follow us on

భారత న్యాయశాఖ చరిత్రలోనే తొలిసారిగా ఓ విచిత్ర కేసు వెలుగు చూసింది. ఎలుక హత్య కేసు ఆరోపణపై ఇటీవల ఓ వ్యక్తిని అరెస్టు చేశారు! అయితే, చనిపోయిన ఎలుక మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన తర్వాత పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడైంది. ఇతర కారణాలతో ఎలుక మృతి చెందిందని,దాన్ని ఎవరూ చంపలేదని తేలింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో చోటుచేసుకుంది. దాని గురించి తెలుసుకునే ముందు, ఎలుకకు పోస్టుమార్టం నిర్వహించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోండి. నిజానికి ఈ ప్రశ్న, సమాధానం రెండూ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (యుపి)లోని బుదౌన్‌లో చోటుచేసుకుంది. నవంబర్ 25 న మనోజ్ అనే వ్యక్తి ఎలుకను కాలువలో ముంచి చంపాడని ఆరోపించబడింది. నిందితుడు ఎలుక తోకను రాయికి కట్టి కాలువలో పడవేసాడని, ఆ తర్వాత అటుగా వెళుతున్న జంతు ప్రేమికుడు వికేంద్ర శర్మ ఎలుకను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని, ఆ ఎలుక చనిపోయిందని ఆరోపణలు వచ్చాయి.

చనిపోయిన ఎలుక మృతదేహాన్ని కాలువలోంచి వెలికితీసి శవపరీక్ష నిర్వహించారు. బరేలీలో ఉన్న ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) ఆ బాధ్యతను చూసింది. మురుగు నీటిలో మునిగి ఈ ఎలుక చనిపోలేదని వారు స్పష్టం చేశారు. అయితే, దాని ఊపిరితిత్తులు, కాలేయం పూర్తిగా ధ్వంసమయ్యాయి. చాలా మటుకు ప్రధాన శరీర అవయవాల వైఫల్యం కారణంగా ఆ ఎలుక చనిపోయిందని సంస్థ జాయింట్ డైరెక్టర్ వెల్లడించారు.. నవంబర్ 25న ఎలుక మృతదేహాన్ని ఐవీఆర్‌ఐకి తీసుకొచ్చామని కేపీ సింగ్ మీడియాకు తెలిపారు. డా. అశోక్ కుమార్, డా. పవన్ కుమార్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఎలుకకు శవపరీక్ష నిర్వహించారు.

కాగా, ఎలుకలను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి మనోజ్‌పై కుమార్ బికేంద్ర శర్మ అనే జంతు ప్రేమికుడు నవంబర్ 24న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. బదౌన్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో మనోజ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద మనోజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై అనేక కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి