Car Stunt: కదులుతున్న కారు పై హీరోయిన్ రేంజ్‌లో ఫోజులిచ్చింది.. కానీ అదే కొంపముంచింది..

|

Nov 11, 2022 | 5:34 PM

అలా చేసి కొంతమంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటే ఇంకొందరు పోలీసులకు చిక్కి చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఓ యువతీ కూడా అదే పని చేసింది.

Car Stunt: కదులుతున్న కారు పై హీరోయిన్ రేంజ్‌లో ఫోజులిచ్చింది.. కానీ అదే కొంపముంచింది..
Viral Video
Follow us on

ఈ మధ్య చాలా మందికి సోషల్ మీడియాలో సెలబ్రెటీ అయ్యిపోవాలనే పిచ్చి పట్టింది. ఇన్స్టెంట్ గా పాపులర్ అవ్వాలని పిచ్చి పిచ్చి స్టంట్ చేస్తున్నారు. అలా చేసి కొంతమంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటే.. ఇంకొందరు పోలీసులకు చిక్కి చిక్కుల్లో పడ్డారు. తాజాగా ఓ యువతి కూడా అదే పని చేసింది. సాహసాలు చేయడం కొన్ని సార్లు సరదాగా అనిపిస్తుంది. కానీ అది మితిమీరితే ఇదిగో ఇలానే ఉంటుంది. తాజాగా ఓ యువతి కదులుతున్న కారు పై హీరోయిన్ రేంజ్ లో ఫోజులిచ్చింది. అదే ఆమె కొంపముంచింది.

కదులుతున్న కారు బానెట్ పై వయ్యారంగా పడుకొని ఫోజులిచ్చింది ఓ యువతి. ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేసిందట. అనుకున్నట్టే ఈవీడియో వైరల్ అయ్యింది. భారీగా లైకులు , కామెంట్లు కూడా వచ్చాయి. అలాగే పోలీసులు కూడా సీన్‌లోకి ఎంటర్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

ఈ సంఘటన నోయిడాలో జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు.  ఆ యువతిని ఆమె స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేసి విచారణ జరుపుతున్నారు. ఈ విషయం పై పోలీసులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై నోయిడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి