స్వప్నకి పోలీసుల అండ…కేరళ ప్రతిపక్షనేత ఆరోపణ

30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితులైన స్వప్న సురేష్, సందీప్ నాయర్ లను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అధికారులు బెంగుళూరులో అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు సరిత్ ని ఇదివరకే కస్టమ్స్ శాఖ అధికారులు..

స్వప్నకి పోలీసుల అండ...కేరళ ప్రతిపక్షనేత ఆరోపణ

Edited By:

Updated on: Jul 12, 2020 | 10:16 AM

30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితులైన స్వప్న సురేష్, సందీప్ నాయర్ లను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అధికారులు బెంగుళూరులో అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు సరిత్ ని ఇదివరకే కస్టమ్స్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద వీరిని అరెస్టు చేశామని, ఈ కేసుకు అంతర్జాతీయ లింక్ ఉన్న కారణంగా ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించామని ఈ సంస్థ అధికారులు తెలిపారు. స్మగుల్ చేసిన గోల్డ్ ద్వారా వచ్ఛే సొమ్మును దేశంలో ఉగ్రవాదులకు అందజేసే అవకాశాలున్నాయని తాము భావిస్తున్నట్టు వారు చెప్పారు. ఈ కేసులొ ఫాజిల్ ఫరీఖ్ అనే వ్యక్తిని కూడా నిందితునిగా పేర్కొన్నారు. కాగా స్వప్న సురేష్ కి పోలీసులు సహకరిస్తున్నారని కేరళ ప్రతిపక్షనేత రమేష్ చెన్నితాల ఆరోపించారు. తిరువనంతపురంలో ట్రిపుల్ లాక్ డౌన్ అమలులో ఉండగా స్వప్న బెంగుళూరు ఎలా వెళ్లిందని ఆయన ప్రశ్నించారు. నిందితులకు ముఖ్యమంత్రి కార్యాలయం కూడా అండగా ఉందని ఆయన అన్నారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ కూడా ఆయనతో ఏకీభవించారు.

కాగా-స్వప్న, సందీప్ ఇద్దరూ బెంగుళూరులోని ఓ హోటల్ లో దాక్కున్నట్టు తెలిసింది. తన క్రెడిట్ కార్డును స్వైప్ చేసేందుకు స్వప్న ఆ హోటల్ లోని ఏటీఎం ని వినియోగించుకోవడంతో వెంటనే ఎన్ ఐ ఏ అధికారులు ఆమెను, ఆ తరువాత సందీప్ ని అరెస్టు చేశారు. స్వప్న దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిలు దరఖాస్తును హైకోర్టు మంగళవారం విచారించనుంది.