ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ (పొలిటికల్ యాక్షన్ కమిటీ) లోని 23 మంది సభ్యులపై త్రిపుర పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేస్తూ.. నిన్న అర్ధరాత్రి వీరందరికీ వేర్వేరుగా సమన్లు జారీ చేశారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం లోని 51 బీ సెక్షన్ కింద కేసు పెడుతున్నామని, ఆగస్టు 1 న పోలీసు స్టేషన్ కు హాజరు కావాలని ఈ సమన్లలో కోరారు. త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ బలోపేతానికి గల అవకాశాలపై స్టడీ చేసేందుకు ఈ సభ్యులంతా ఈ నెల 25 న ఈ రాష్ట్రానికి చేరుకున్నారు. అయితే వీరు బస చేసిన హోటల్ నుంచి బయటకు వచ్చేందుకు అనుమతించకుండా పోలీసులు ఆ రోజు నుంచే నిర్బంధంలో ఉంచారు. తాము ఏదో రీసెర్చ్ ఆధారిత వర్క్ కోసం ఈ రాష్ట్రానికి వచ్చినట్టు ఈ బృందం తెలిపిందని, ఆ వర్క్ ఏమిటో తాము ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని, పైగా వీరి కోవిడ్ టెస్టు ఫలితాలకోసం కూడా వేచి ఉన్నామని త్రిపుర ఎస్పీ మాణిక్ దాస్ తెలిపారు. ఈ ఫలితాలు రేపు అందవలసి ఉందన్నారు. విచారణ అనంతరం వీరి విడుదలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా ఈ టీమ్ నిర్బంధం నేపథ్యంలో బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన ఓ ప్రతినిధి బృందం బుధవారం ఈ రాష్ట్రాన్ని సందర్శించే అవకాశం ఉంది. టీమ్ సభ్యుల విడుదల విషయమై ఈ బృందం అధికారులతో చర్చలు జరపవచ్చు.
అయితే ప్రశాంత్ కిషోర్ టీమ్ సభ్యుల నిర్బంధాన్ని మాజీ సీఎం, ప్రతిపక్ష నేత మాణిక్ సర్కార్ ఖండించారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని ఆయన ఆరోపించారు. ఈ రాష్ట్రంలో బీజేపీ తన బేస్ ను కోల్పోతోందని, అందువల్లే బిప్లబ్ దేబ్ ప్రభుత్వం సమాచార మూలాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా.. సమాచార సేకరణ కోసం వచ్చినవారిని హోటల్ లో నిర్బంధించడం తగదని ఆయన చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి :Bunny Vasu – Sundar Pichai Video: గూగుల్ CEO సుందర్ పిచాయ్‌కు లేఖ రాసిన మెగా నిర్మాత బన్నీ వాసు..
ఆంధ్ర-తమిళనాడు బోర్డర్ కుప్పంలో పోలీసుల పేరుతో కర్ణాటక దొంగల హల్‌చల్..:Kuppam Video.