ట్రంప్‌కు మోదీ ఫోన్.. పాక్ తీరుపై విమర్శలు

| Edited By:

Aug 19, 2019 | 9:27 PM

ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్ కాల్‌చేసి మాట్లాడారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సంభాషణలో ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొందరు నేతలు భారత్‌‌కు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నారని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీమాంతర ఉగ్రవాద నిర్మూలన, శాంతిస్థాపన ఆవశ్యకతను ఈ సందర్భంగా హైలైట్ చేశారు ప్రధాని మోదీ. జూన్‌ నెలాఖరులో ఒసాకాలో జరిగిన జీ20 సదస్సులో […]

ట్రంప్‌కు మోదీ ఫోన్.. పాక్ తీరుపై విమర్శలు
Follow us on

ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఫోన్ కాల్‌చేసి మాట్లాడారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సంభాషణలో ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని ప్రధాని మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. కొందరు నేతలు భారత్‌‌కు వ్యతిరేకంగా హింసను ప్రేరేపిస్తున్నారని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీమాంతర ఉగ్రవాద నిర్మూలన, శాంతిస్థాపన ఆవశ్యకతను ఈ సందర్భంగా హైలైట్ చేశారు ప్రధాని మోదీ.

జూన్‌ నెలాఖరులో ఒసాకాలో జరిగిన జీ20 సదస్సులో ఇరు దేశాల మధ్య చర్చకు వచ్చిన అంశాలను ప్రధాని మోదీ ఈ సందర్భంగా ట్రంప్‌తో ప్రస్తావించారు. ఈ ఏడాది జూన్‌ నెలాఖరులో ఒసాకాలో జరిగిన జీ20 సదస్సులో ఇరు దేశాల మధ్య చర్చకు వచ్చిన అంశాలను ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత్‌ – అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపైనా మాట్లాడారు. ఉగ్రవాద నిర్మూలన, సీమాంతర ఉగ్రవాదం తదితర అంశాలపై అగ్రనేతలిద్దరూ చర్చించారు. పేదరికం, నిరక్షరాస్యతపై పోరాడేందుకు కలిసి వచ్చే ఎవరితోనైనా కలిసి ముందుకు వెళ్తామని మోదీ తెలిపారు.