Modi Meet MPs: ఏపీ, తెలంగాణ, కర్నాటక బీజేపీ ఎంపీలతో ప్రధాని భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం!

Modi Meet Southern states MPs: దేశవ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ బలోపేతం చేసేందుకు ఆధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా పాదువులు కదుపుతోంది బీజేపీ అధినాయకత్వం.

Modi Meet MPs: ఏపీ, తెలంగాణ, కర్నాటక బీజేపీ ఎంపీలతో ప్రధాని భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం!
Modi

Updated on: Dec 15, 2021 | 9:03 AM

PM Modi Meet Telangana, AP MPs: దేశవ్యాప్తంగా భారతీయ జనతాపార్టీ బలోపేతం చేసేందుకు ఆధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా పాదువులు కదుపుతోంది బీజేపీ. ఇప్పటికే ఉత్తరాదిన తిరుగులేని శక్తిగా ఎదిగిన పార్టీ.. దక్షిణాదిన కూడా సత్తా చాటాలని భావిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు ఎప్పటినుంచో అనుకుంటుంది. ముఖ్యంగా తెలంగాణ, ఏపీలల్లో వలసలు చేరికల ద్వారా పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో అనుకన్నంతగా ఎంపీ సీట్లను గెలవాలని పార్టీ అధినాయత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన బీజేపీ (bjp) ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ భేటీ కానున్నారు. ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఉదయం 9.30 గంటలకు మోడీ సమావేశం కానున్నారు. ఉదయం అల్పాహార విందుకు తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలను ప్రధాని ఆహ్వానించారు. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన లోక్‌సభ, రాజ్యసభల్లోని బీజేపీ ఎంపీలు హాజరుకానున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితులు, పార్టీని బలోపేతం చేయాలంటే ఎలాంటి ప్రణాళికలతో ముందుకు పోవాలనే విషయాలను ప్రధాన మోదీతో ఎంపీలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతకుముందు తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు హోం మంత్రి అమిత్ షాతో సమావేశం కావాల్సి ఉన్నా.. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ హఠాన్మరణంతో ఆ భేటీ రద్ధు అయింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ నేతలనే కాకుండా కర్ణాటక బీజేపీ ఎంపీలు కూడా ప్రధాని మోడీతో సమావేశం కానున్నారు. దక్షిణ భారతంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ సహా పలు అంశాలపై ప్రధాని చర్చించనున్నారు.

ఇదిలావుంటే ఉత్తర‌ప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ మంగళవారం బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సుపరిపాలనపై సెమినార్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులు, సమస్యలపై ప్రధాని ముఖ్య‌మంత్రుల‌తో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ సహా మరిన్ని అంశాలపై బీజేపీ సీఎంలతో ప్రధాని మోడీ చర్చించారు. ఉత్తరప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేప‌థ్యంలో మోడీతో సీఎంల భేటీకి ప్రాధాన్యత సంతరించుకొంది.

Read Also…  Omicron in Konaseema: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఒమిక్రాన్‌ కలకలం.. కోనసీమలో ఓ యువకుడికి కొవిడ్ పాజిటివ్!