Narendra Modi: నవంబర్ 5న కేదార్‎నాథ్‎లో పర్యటించనున్న ప్రధాని మోడీ.. కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 5న కేదార్‌నాథ్‌లో పర్యటించనున్నారు. అక్కడ రూ. 250 కోట్ల విలువైన కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు...

Narendra Modi: నవంబర్ 5న కేదార్‎నాథ్‎లో పర్యటించనున్న ప్రధాని మోడీ.. కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం..
Modi

Updated on: Oct 16, 2021 | 5:18 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 5న కేదార్‌నాథ్‌లో పర్యటించనున్నారు. అక్కడ పూజలు చేసిన తర్వాత రూ. 250 కోట్ల విలువైన కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టులను నిశితంగా పరిశీలించనున్నారు. ఈనెల 7న ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ రిషికేశ్‌లోని ఆల్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)ను సందర్శించారు. మోడీ 2014లో ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కేదార్‌నాథ్‌ను అనేకసార్లు సందర్శించారు.

అయితే కోవిడ్ -19 మహమ్మారి కారణంగా గత సంవత్సరం కేదార్‌నాథ్‌ను సందర్శించలేకపోయారు. వచ్చే నెలలో మోదీ పర్యటన ఉంటుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. దేవాలయంలో ప్రార్థనలు చేయడమే కాకుండా పలు అభివృద్ధి పనులను ప్రధాని ప్రారంభించే అవకాశం ఉందని ఆయన చెప్పారు. రూ. 150 కోట్ల విలువైన రెండవ దశ కేదార్‌పురి పునర్నిర్మాణ ప్రాజెక్టులకు కూడా ప్రధాని శంకుస్థాపనలు చేసే అవకాశం ఉందిని ధామి చెప్పారు. శీతాకాలం సందర్భంగా కేదార్‌నాథ్‌ పోర్టల్‎ను మూసివేయనున్నారు.

Read Also.. Heavy Rains in Kerala: కేరళలో భారీ వర్షాలు ఏడు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. పర్యాటక ప్రదేశాలకు వెళ్ల వద్దని సూచన

Loading...
Unable to load recommendations.
Follow Us