Chenab Railway bridge: పాక్, చైనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చీనాబ్ రైల్వే వంతెన.. దీని ప్రత్యేకత ఏమిటంటే..

|

Feb 20, 2024 | 11:52 AM

ఈ స్టీల్ ఆర్చ్ వంతెన బ్లాస్ట్ ప్రూఫ్ వంతెన. అంతేకాదు భూకంపాలను కూడా తట్టుకుని నిలబడుతుంది. కశ్మీర్ లోయలో హైస్పీడ్ రైళ్లు నడపడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా వర్ణించబడుతోంది. పాకిస్తాన్ సరిహద్దులోని వైమానిక స్థావరానికి దూరం కేవలం 65 కిలోమీటర్లు మాత్రమే. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. పాకిస్తాన్, చైనా వంతెనపై ఎందుకు నిద్రను కోల్పోతున్నాయో తెలుసుకుందాం.

Chenab Railway bridge: పాక్, చైనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చీనాబ్ రైల్వే వంతెన.. దీని ప్రత్యేకత ఏమిటంటే..
Chenab Railway Bridge
Image Credit source: railway-technology
Follow us on

భారతదేశంలోని ఓ రైల్వే వంతెన పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలకు నిద్రలేని రాత్రులను మిగులుస్తుంది. ఈ వంతెన జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా లను కలుపుతూ  రైలు లింక్ ప్రాజెక్ట్ కింద చీనాబ్ నదిపై వంతెన నిర్మాణం అన్న సంగతి ప్రకటించిన వెంటనే రెండు దేశాలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ఎందుకంటే ఈ రైల్వే వంతెన సాధారణ కదలికను సులభతరం చేయడమే కాదు.. భారత సైన్య కదలికలను సులభతరం చేస్తోంది.

ఈ స్టీల్ ఆర్చ్ వంతెన బ్లాస్ట్ ప్రూఫ్ వంతెన. అంతేకాదు భూకంపాలను కూడా తట్టుకుని నిలబడుతుంది. కశ్మీర్ లోయలో హైస్పీడ్ రైళ్లు నడపడానికి మార్గం సుగమం చేస్తుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా వర్ణించబడుతోంది. పాకిస్తాన్ సరిహద్దులోని వైమానిక స్థావరానికి దూరం కేవలం 65 కిలోమీటర్లు మాత్రమే. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఈ వంతెనను ప్రధాని నరేంద్ర మోడీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. పాకిస్తాన్, చైనా వంతెనపై ఎందుకు నిద్రను కోల్పోతున్నాయో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

120 ఏళ్ల పాటు ఉండేలా రూపొందించారు

చీనాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన పొడవు 1.315 కి.మీ. ఈ వంతెన నది మట్టం నుండి 359 మీటర్ల ఎత్తులో ఉంది. రిక్టర్‌ స్కేలుపై 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను కూడా తట్టుకునే సామర్థ్యం ఈ వంతెనకు ఉంది. ఈ వంతెన గంటకు 260 కి.మీ వేగంతో వీచే గాలులను కూడా తట్టుకోగలదు. ఇది పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంది. చైనాలోని షుపై నదిపై నిర్మించిన వంతెన 275 మీటర్ల ఎత్తులో ఉంది. నదీ గర్భం నుంచి చీనాబ్ రైల్వే వంతెన ఎత్తు 359 మీటర్లు. ఈ వంతెన 120 సంవత్సరాల పాటు సేవలందించే విధంగా రూపొందించబడింది. ఇది జమ్మూ నుండి కాశ్మీర్ లోయకు ఈజీగా ప్రయాణించవచ్చు. కాశ్మీర్ లోయ కనెక్టివిటీని పెంచుతుంది.

భూకంపం జోన్ ను తట్టుకునే విధంగా

ఈ వంతెనపై రైళ్లు గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో నడవవచ్చు. దీని ప్రధాన ఆర్చ్ స్పాన్ 467 మీటర్లు. ఇది భారతీయ రైల్వే పొడవైన స్పాన్ వంపు వంతెనగా చెప్పబడుతోంది. ఈ వంతెన విస్తీర్ణం భూకంప జోన్ 4లో ఉన్నప్పటికీ.. ఇది భూకంప జోన్ ఐదు కోసం రూపొందించబడింది. అంటే  భూకంపం ఏర్పడినా వంతెన చాలా సురక్షితం. రిక్టర్ స్కేల్‌లో ఎనిమిది తీవ్రత కలిగిన భూకంపాన్ని కూడా సులభంగా తట్టుకోగలదు.

బలమైన గాలిని కూడా తట్టుకునే విధంగా

ఈ వంతెన నిర్మాణంలో కశ్మీర్ లోయలో బలమైన గాలులు వీచినా తట్టుకుని నిలబడే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. అందువల్ల గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సులభంగా తట్టుకోగలిగే విధంగా దీన్ని రూపొందించారు. చీనాబ్ రైల్వే బ్రిడ్జిపై రెండు ట్రాక్‌లు ఏర్పాటు చేయబడ్డాయి, తద్వారా రైళ్లు క్రాసింగ్ కోసం ఎక్కడా ఆగాల్సిన అవసరం లేదు. ఇది ఇంక్రిమెంటల్ లాంచింగ్ లేదా పుష్-పుల్ టెక్నాలజీతో తయారు చేయబడింది. ఆర్చ్ మొత్తం బరువు 10619 మెట్రిక్ టన్నులు. దీని భాగాలను భారతీయ రైల్వేలు మొదటిసారిగా కేబుల్ క్రేన్ ద్వారా అమర్చారు. ఈ వంతెన ఉన్నత స్థాయి ఇంజనీరింగ్‌కు ఉదాహరణగా నిలుస్తుంది.

చీనాబ్ రైల్వే వంతెన

ప్రపంచ స్థాయిలో వెల్డింగ్

చీనాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో మొత్తం 18 పిల్లర్లు ఉన్నాయి. దీని ఎత్తైన కాంక్రీట్ స్తంభం 49.343 మీటర్లు,  ఉక్కు స్తంభం 130 మీటర్ల ఎత్తు. దీని తయారీకి 27 వేల టన్నులకు పైగా ఉక్కును ఉపయోగించారు. విశేషమేమిటంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సహాయంతో ఈ వంతెన బ్లాస్ట్ లోడ్ కోసం రూపొందించబడింది. అంటే ఎటువంటి బ్లాస్ట్ జరిగినా ఈ వంతెనపై ఎటువంటి ప్రభావం చూపదు. దీన్ని కనెక్ట్ చేయడానికి ప్రపంచ స్థాయి వెల్డింగ్ ఉపయోగించబడింది.

అందుకే చైనా-పాకిస్థాన్‌ల్లో టెన్షన్‌

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సిద్ధంగా ఉన్న చీనాబ్ వంతెన పాకిస్థాన్, చైనాలలో ప్రకంపనలు సృష్టించింది.  ఎందు కంటే ఈ వంతెన ద్వారా కాశ్మీర్ లోయ నేరుగా భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించబడుతుంది. భారత సైన్యం సుదూర సరిహద్దులను చేరుకోవడం చాలా సులభతరం అవుతుంది. రహదారిపై ఇబ్బందులను నివారించడం, సైన్యం, లాజిస్టిక్స్ శత్రువులను ఎదుర్కోవడానికి నేరుగా చేరుకోగలవు. దేశం నలుమూలల నుంచి కశ్మీర్ లోయలో వాణిజ్యం కూడా పెరుగుతుంది.  సాధారణ పర్యాటకులు భూతల స్వర్గానికి సులభంగా చేరుకోగలుగుతారు.

వాస్తవానికి జమ్మూ కశ్మీర్‌ను కలిపే ఈ వంతెనలో ఒక భాగం రియాసిలో..  మరొక భాగం బక్కల్ (ఉధంపూర్)లో ఉంది. దాదాపు రూ.28 వేల కోట్లతో నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణం 2004లో ప్రారంభించి 2009లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ సైట్ వద్ద పనులు చాలాసార్లు నిలిపివేయవలసి వచ్చింది.

కశ్మీర్ లోయలో రైల్వే కొత్త ప్రయాణం

ప్రస్తుతం కశ్మీర్ లోయలో ఉత్తరాన బారాముల్లా జిల్లా నుండి జమ్మూ ప్రాంతంలోని రాంబన్ జిల్లాలోని బనిహాల్ వరకు రైలు మార్గం ఉంది. కొత్త రైల్వే వంతెన జమ్మూలోని కత్రాతో లోయను నేరుగా కలుపుతుంది. దీంతో కత్రా నుంచి శ్రీనగర్‌కు వెళ్లాలంటే ఐదు నుంచి ఆరు గంటల కంటే తక్కువ సమయం పడుతుంది. దీంతో కశ్మీర్ ప్రజలు రోడ్డు మార్గంపై ఆధారపడటం తగ్గుతుంది. ఏది ఏమైనప్పటికీ భారీ హిమపాతం, కొండ చరియలు విరిగిపడటం, హిమపాతాల కారణంగా శ్రీనగర్-జమ్మూ రహదారి తరచుగా మూసివేయబడుతుంది. దీంతో ప్రజల రాకపోకలు, వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..