
ఉమ్మడి పౌరస్మృతి, యూనిఫాం సివిల్ కోడ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ సంచలన కామెంట్స్ చేశారు. మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. దేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఉందని ఉద్ఘాటించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేవానికి యూనిఫాం సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి అవసర ఉందన్నారు. ఈ విషయంలో ముస్లింలను కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు ప్రధాని మోదీ.
‘మేరా బూత్-సబ్ సే మజ్‌బూత్’ పేరుతో నిర్వహించిన భోపాల్ బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. బీజేపీకి కార్యకర్తలే ముఖ్యమన్నారు. బూత్ లెవెల్ కార్యకర్తలతో సమావేశం కావడం ఆనందంగా ఉందన్నారు మోదీ. బీజేపీ కార్యకర్తలకు పార్టీ కంటే దేశం ముఖ్యమన్నారాయన.
వర్చువల్‌గా 10 లక్షల మంది కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు ప్రధాని మోదీ. పార్టీ అధ్యక్షుడు నడ్డా కృషి తోనే ఇది సాధ్యమయ్యిందన్నారు. మధ్యప్రదేశ్‌కు ఒకే రోజు రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించినట్టు చెప్పారు.
#WATCH | PM Narendra Modi speaks on the Uniform Civil Code (UCC)
“Today people are being instigated in the name of UCC. How can the country run on two (laws)? The Constitution also talks of equal rights…Supreme Court has also asked to implement UCC. These (Opposition) people… pic.twitter.com/UwOxuSyGvD
— ANI (@ANI) June 27, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..