Heeraben Modi Passes Away: ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం.. హీరా బెన్ కన్నుమూత..

|

Dec 30, 2022 | 7:33 AM

PM Modi's Mother Passes Away: ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మాతృవియోగం కలిగింది. అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో హీరాబెన్ మోదీ తుదిశ్వాస విడిచారు.

Heeraben Modi Passes Away: ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం.. హీరా బెన్ కన్నుమూత..
Heeraben Modi
Follow us on

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మాతృవియోగం కలిగింది. తన తల్లి తుదిశ్వాస విడచిన్నట్టు ప్రధాని మోదీ ట్విట్టర్‌లో వెల్లడించారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురవడంతో అహ్మదాబాద్‌లోని మెహతా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఇటీవలే ఆమె 100వ పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రధాని తల్లి హీరాబెన్ మోదీ గాంధీనగర్ శివార్లలోని రైసన్ గ్రామంలో తమ్ముడు పంకజ్ మోదీతో కలిసి నివసిస్తున్నారు.

ప్రధాని మోదీ, తల్లి హీరాబెన్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. తాను అందుకుంటున్న విజయాల వెనుక తన తల్లి హీరాబెన్ ఉందని ఎప్పుడూ ప్రధాని మోదీ పలు సందర్భాల్లో గుర్తు చేసుకునేవారు. ప్రధాని మోదీ ఎంత బిజీగా ఉన్నా.. ఫోన్ కాల్ ద్వారా ఆమె క్షేమ సమాచారాలను తెలుసుకునేవారు. డిసెంబర్‌లో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌ను కలిశారు, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. గుజరాత్ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా డిసెంబర్ 4న గాంధీనగర్‌లో ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్‌ను చివరిసారిగా కలిశారు. ఈ సందర్భంగా అమ్మవారి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకుని, ఆమెతో కూర్చొని టీ తాగారు.

గుజరాత్ ఎన్నికలకు ముందు, జూన్ 18న తన 100వ పుట్టినరోజు సందర్భంగా మోదీ తన తల్లిని కలిశారు. జూన్ 23న ఆమె పుట్టినరోజునాడు, సెప్టెంబర్‌ 17న మోదీ జన్మదినం రోజు కచ్చితంగా హీరాబెన్‌ దగ్గరికి వస్తారు మోదీ. కానీ, ఈసారి సెప్టెంబర్‌ 17నే రాలేకపోయానంటూ మోదీ బాధపడిన సందర్భమూ ఉంది. రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు.. దేశాన్ని నడిపిస్తున్న నాయకుడైనా తల్లిని చూడగానే చిన్నపిల్లాడిలా కనిపించేవారాయన. అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 11, 12 తేదీలలో గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నప్పుడు, మార్చి 11న రాత్రి 9 గంటలకు తల్లి హీరాబెన్‌ను కలవడానికి గాంధీనగర్‌కు చేరుకున్నారు. అక్కడ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెతో కలిసి కిచ్చీలు తిన్నారు.

హీరాబెన్ మోదీ స్వస్థలం.. వాద్‌నగర్

హీరాబెన్ మోదీ స్వస్థలం గుజరాత్‌లోని మెహసానాలోని వాద్‌నగర్. ఆమె భర్త దామోదర్ దాస్ మూల్‌చంద్ . ఈ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. మూడవ సంతానంగా ప్రధాని మోదీ జన్మించారు. పెద్దకుమారుడు సోమ మోదీ, ఆరోగ్య శాఖలో రిటైర్డ్ అధికారి. పంకజ్ మోదీ, గుజరాత్ ప్రభుత్వ సమాచార శాఖలో క్లర్క్, అమృత్ మోదీ, రిటైర్డ్ లేత్ మెషిన్ ఆపరేటర్), ప్రహ్లాద్ మోదీ రేషన్‌ షాప్‌ యజమాని. . హీరాబెన్‌ కూతురు పేరు వాసంతీబెన్ హస్ముఖ్‌లాల్ మోదీ.

తన భర్త మరణం తర్వాత, హీరాబెన్ మోదీ తన చిన్న కొడుకు పంకజ్ మోదీ ఇంట్లోనే ఉన్నారు. ఆమె 2016 మేలో మొదటిసారి ఢిల్లీలోని నరేంద్ర మోదీ అధికారిక నివాసాన్ని సందర్శించారు. ఆయన పలుమార్లు దీవెనలకై గాంధీనగర్‌లోని తన తల్లి దగ్గరికి వెళ్ళివస్తుంటారు. 2016 నవంబరులో పాత కరెన్సీ నోట్లను బ్యాన్ చేయడంపై తన కుమారుడి నిర్ణయానికి మద్దతుగా ఆమె ATM క్యూలో నిలబడి అందరిని ఆకట్టుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడికి ఓటు వేయాలని హీరాబెన్ మోదీ ప్రచారం చేయడమేకాక 99 ఏళ్ల వయసులో కూడా ఆమె ఓటు వేశారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె ఓటేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..