అగ్నివీర్ తొలి బ్యాబ్‌ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ అగ్ని వీర్‌లతో సోమవారం ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. మొదటి బ్యాచ్‌లో భాగంగా పలు విభాగాల్లో ఎంపికైన వారికి 6 నెలలు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం వీరిని భారత సైన్యంలోకి తీసుకోనున్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ శిక్షణ శిబిరాలకు వీరు చేరుకోనున్నారు. గోవా, హైదరాబాద్, మద్రాస్, పుణె, మధ్యప్రదేశ్‌లోని సాగర్, హిమాచల్ ప్రదేశ్‌లోని సుబాతులో శిక్షణకు సిద్ధమవుతోన్న అగ్నివీర్‌లతో ప్రధాని మాట్లాడారు.
ఇదిలా ఉంటే నాసిక్‌లోని ఆర్టిలరీ సెంటర్‌లో మొదటి బ్యాచ్‌లో భాగంగా 2600 మంది అగ్నివీర్‌లకు శిక్షణ ప్రారంభమైంది. జనవరి 1వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభమైందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఆర్టిలరీ ట్రైనింగ్ సెంటర్‌లో అన్ని శిక్షణలకు అవసరమయ్యే సదుపాయాలను ఒకేచోట అందుబాటులో ఉంచారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi and Defence Minister Rajnath Singh interact with Agniveers.
(Source: PMO) pic.twitter.com/SmCKyzSbjW
— ANI (@ANI) January 16, 2023
ఇక్కడ శిక్షణ తీసుకున్న అగ్నివీరులకు ఇండియన్ ఆర్మీలో డ్రైవర్లుగా, ఆపరేటర్లుగా, సాంకేతిక సహాయకులిగా సేవలందిందిచే అవకాశం లభిస్తుంది. ఈ అగ్నివీర్లకు శిక్షణ 31 వారాలు ఉంటుందని ఇందులో 10 వారాల పాటు ప్రాథమిక శిక్షణ, 21 వారాల పాటు అధునాతన శిక్షణ అందిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..