ఐఎస్ఎస్​‌కు వెళ్లిన తొలి భారతీయుడు గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోదీ

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో భారత వైమానిక దళ అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్ష సంభాషణ నిర్వహించారు. ఈ సంభాషణ భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడమే కాకుండా, భారతదేశ శాస్త్రీయ సామర్థ్యాన్ని, ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో దాని బలమైన భాగస్వామ్యాన్ని సూచిస్తుంది.

ఐఎస్ఎస్​‌కు వెళ్లిన తొలి భారతీయుడు గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోదీ
Pm Modi Interacted With Shubhanshu Shukla

Updated on: Jun 28, 2025 | 6:34 PM

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో భారత వైమానిక దళ అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్ష సంభాషణ నిర్వహించారు. ఈ సంభాషణ భారతదేశ అంతరిక్ష చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడమే కాకుండా, భారతదేశ శాస్త్రీయ సామర్థ్యాన్ని, ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో దాని బలమైన భాగస్వామ్యాన్ని సూచిస్తుంది.

శుభాన్షు శుక్లాతో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన ప్రధానమంత్రి మోదీ ఆయన ధైర్యాన్ని, సహకారాన్ని ప్రశంసించారు. ఈ మేరకు ప్రధానమంత్రి మోదీ తన సోషల్ మీడియా ఖాతా Xలో ట్వీట్ చేయడం ద్వారా ఈ సమాచారాన్ని అందించారు.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో డ్రాగన్‌ వ్యోమనౌక జూన్ 25న ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. 28గంటల పాటు ప్రయాణించిన డ్రాగన్‌ రాకెట్‌ ఐఎస్‌ఎస్‌కు చేరింది. యాక్సియం-4 మిషన్‌కు సంబంధించిన డాకింగ్‌ ప్రక్రియ పూర్తి కావడంతో ఒకట్రెండు గంటల పాటు పూర్తిస్థాయిలో తనిఖీలు, సర్దుబాట్లు చేసుకుని నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశించారు.

భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతో పాటు నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు చేరగానే చిరునవ్వులు చిందించారు. ఐఎస్‌ఎస్‌లో అంతకుముందే ఉన్న ఏడుగురు వ్యోమగాములతో కలిసిపోయారు. ఇక.. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14రోజులపాటు గడపనుంది. దాదాపు 60 ప్రయోగాలు చేయనున్నారు. అందులో హ్యూమన్‌ ఫిజియాలజీ, న్యూట్రిషన్, సీడ్‌ జెర్మినేషన్‌లలో మైక్రో గ్రావిటీ పరిశోధనలున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..