ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరం చేరుకుని.. పంబన్ బ్రిడ్జిని ప్రారంభించారు.. రిమోట్ ద్వారా పంబన్ బ్రిడ్జిని మోదీ ప్రారంభించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని.. ఈ బ్రిడ్జిని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఆయన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జిని ప్రారంభించగానే, వంతెన పైకి వెళ్లింది. అదే సమయంలో ఆ వంతెన కింది నుంచి ఇండియన్ కోస్ట్‌గార్డ్ షిప్ ఆ ప్రాంతాన్ని దాటివెళ్లింది. ప్రపంచంలోనే వండర్ వంతెన ఇది. మరో వందేళ్లపాటు సేవలు అందించే వారధి ఇది. భారతీయ రైల్వేల ఇంజినీరింగ్ అద్భుతానికి పంబన్ బ్రిడ్జి తిరుగులేని ఉదాహరణ. దేశంలో తొలి వెర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ పంబన్‌లో ఏర్పాటు చేశారు.
పంబన్ రైల్వే బ్రిడ్జ్…దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఇది తమిళనాడు ప్రధాన భూ భాగాన్ని రామేశ్వరం ద్వీపంతో కలిపే రైల్వే బ్రిడ్జి. అదే సమయంలో నౌకలు వచ్చినప్పుడు వాటికి దారి ఇచ్చేలా ఇది ఓపెన్ అవుతుంది. అయితే ఇది కట్టి వందేళ్లు దాటిపోవడం, దీని జీవితకాలం దాదాపు పరిసమాప్తమవడంతో, పంబన్‌లో కొత్త రైల్వే బ్రిడ్జిని నిర్మించారు.
పంబన్ పాత రైల్వే బ్రిడ్జి.. నౌకలు వచ్చినప్పుడు, రెండు భాగాలుగా ఓపెన్ అయి, ఆ నౌకలకు దారి ఇస్తుంది. అయితే ఈ కొత్త రైల్వే బ్రిడ్జి మాత్రం.. నౌకలు వచ్చినప్పుడు… లిఫ్ట్ లాగా పైకి వెళుతుంది. శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12.45కి పంబన్ నుంచి రిమోట్ నొక్కి వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీసింది.. అనంతరం ఓ కోస్ట్ గార్డ్ షిప్, ఈ బ్రిడ్జి కింద నుంచి వెళ్లింది.
రామేశ్వరం ద్వీపంలోని ఈ పంబన్ ప్రాంతానికి, రామాయణ ఇతిహాసంతో కూడా సంబంధం ఉంది. రామేశ్వరం లోని ధనుష్కోటి నుంచే రామసేతును వానరుల సాయంతో శ్రీరాముడు నిర్మించాడని రామాయణం చెబుతోంది. అలా మన సాంస్కృతిక వారసత్వానికి కూడా పంబన్ వంతెన ఓ వారధిలా ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..