PM Narendra Modi hosts dinner: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈనెల 24వ తేదీతో (ఆదివారం) పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన గౌరవార్థంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం రాత్రి ఢిల్లీలో ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేశారు. ఈ విందు కార్యక్రమానికి రామ్‌నాథ్ కోవింద్ దంపతులు.. కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. వారితోపాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పద్మ అవార్డుల గ్రహీతలు, గిరిజన నాయకులు పాల్గొన్నారు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, అధీర్ రంజన్ చౌదరి హాజరయ్యారు.
కాగా.. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నేరుగా ఆహ్వాన కార్డులు పంపడానికి సమయం లేకపోవడంతో.. ఢిల్లీలోని ఆ రాష్ట్రభవన్‌ల రెసిడెంట్ కమిషనర్లకు వాటిని అందిస్తున్నట్లు ప్రధాని కార్యాలయం అంతకుముందు వెల్లడించింది. వారు హోంశాఖ కార్యాలయం నుంచి నేరుగా కార్డులను తీసుకొని తమ సీఎంలు, డిప్యూటీ సీఎంలకు పంపించాలని సూచించింది. అయితే.. ఈ కార్యక్రమానికి బీజేపీ, ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్, ఒడిశా సీఎంలనూ మాత్రమే ప్రధానమంత్రి కార్యాలయం ఆహ్వానితుల జాబితాలో చేర్చింది. తెలంగాణ సీఎంకు ఆహ్వానం అందలేదు.
Hosted a dinner in honour of President Kovind Ji. Smt. Droupadi Murmu Ji, Venkaiah Ji, other esteemed dignitaries including Ministers were present. We were also glad to welcome several grassroots level achievers, Padma awardees, tribal community leaders and others at the dinner. pic.twitter.com/Do9j2hneYK
— Narendra Modi (@narendramodi) July 22, 2022
తెలంగాణ సీఎం కేసీఆర్‌తోపాటు కేరళ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, మిజోరం, ఝార్ఖండ్ ముఖ్యమంత్రులను ఆహ్వానించలేదు. అయితే ఒక్క తమిళనాడు సీఎం స్టాలిన్‌ను మాత్రం ఆహ్వానించడం విశేషం. ప్రధాని మోడీ రాష్ట్రపతి గౌరవార్థంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి బీజేపీ సీఎంలు మినహా ఒడిశా, ఏపీ, తమిళనాడు ముఖ్యమంత్రులు హాజరు కాలేదు.
Some more glimpses from the dinner in the honour of President Kovind. pic.twitter.com/8yjDckBuqr
— Narendra Modi (@narendramodi) July 22, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..