CM KCR Birthday: సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?

PM Narendra Modi Greetings to CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్ రావు (CM KCR) ఈ రోజుతో (ఫిబ్రవరి 17) 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం

CM KCR Birthday: సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
Pm Narendra Modi Cm Kcr

Updated on: Feb 17, 2022 | 10:57 AM

PM Narendra Modi Greetings to CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కే చంద్రశేఖర్ రావు (CM KCR) ఈ రోజుతో (ఫిబ్రవరి 17) 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిషలు పోరాటం చేసిన సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) స్వయంగా ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రధాని మోదీ.. ట్వీట్టర్ వేదికగా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. 68వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సీఎం కేసీఆర్ చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ ట్వీట్‌లో రాశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపీ బండి సంజయ్ కూడా సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు.

ఇదిలాఉంటే.. సీఎం కేసీఆర్ తనయుడు.. మంత్రి కేటీఆర్ (KTR), కూతురు ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీష్ రావు, సైతం ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ (CM KCR Birthday) జన్మదినాన్ని ఈ సారి నిర్వహిస్తున్నారు. ఈనెల 15 నుంచి ఈరోజు వరకు జన్మదిన వేడుకలను నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

Also Read:

CM KCR Birthday: 68వ వసంతంలోకి సీఎం కేసీఆర్.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జన్మదిన వేడుకలు..

Medaram Jathara 2022: మహా జన జాతరలో సందడిగా తొలి ఘట్టం.. ఇవాళ సమ్మక్క ఆగమనం