PM Narendra Modi Europe Tour: చాలా రోజుల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ప్రధాని యూరఫ్ టూర్‌కు ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ తన మూడు రోజుల యూరప్ పర్యటనలో భాగంగా సోమవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ నుంచి జర్మనీకి బయలుదేరారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ఒక ట్వీట్‌లో, “ప్రధానమంత్రి మోడీ బెర్లిన్‌కు వెళ్లారు, అక్కడ అతను భారతదేశం జర్మనీ సహకారాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారు.” అని పేర్కొన్నారు.
కొవిడ్ విజృంభణ తరువాత రెండేళ్లలో తొలిసారి విదేశాల్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. ఇవాళ్టి నుంచి మూడు రోజుల ఫారెన్‌లో పర్యటించనున్నారు ప్రధాని. ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్దం జరుగుతున్న వేళ, మోదీ యూరప్ పర్యటనకు ప్రాధాన్యత ప్రాధాన్యత. తొలుత జర్మనీకి, అక్కడి నుంచి డెన్మార్క్‌కు వెళ్లనున్న ప్రధాని, తిరుగు ప్రయాణంలో మే 4న పారిస్ చేరుకుంటారు. మూడు దేశాల్లో దాదాపు 65 గంటల పాటు గడపనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. డెన్మార్క్, జర్మనీలలో ఒక రాత్రి చొప్పున బస చేయనున్నారు. ఏడు దేశాలకు చెందిన ఎనిమిది మంది ప్రపంచ నేతలు, 50 మంది అంతర్జాతీయ పారిశ్రాకవేత్తలతో సమావేశం కానున్నారు.
ప్రధానమంత్రి సోమవారం జర్మనీలోని బెర్లిన్‌కు చేరుకుంటారు, అక్కడ జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో కలిసి 6వ ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్ (IGC)లో పాల్గొంటారు. ఇతర ఉన్నత స్థాయి పరస్పర చర్యలతో పాటు నార్డిక్ దేశాల నాయకులతో చర్చలు జరపడానికి ప్రధాని మోదీ మంగళవారం డెన్మార్క్‌ను సందర్శించనున్నారు. ఆయన పర్యటన బుధవారం పారిస్‌లో ముగుస్తుంది. అక్కడ ప్రధాని కొత్తగా ఎన్నికైన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కలుసుకుంటారు.
యూరప్ పర్యటనలో 25 సమావేశాల్లో పాల్గొంటారని పీఎంవో వర్గాలు వెల్లడించాయి. పలువురు ప్రపంచ నేతలతో భేటీలో ద్వైపాక్షిక, అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు పీఎం మోదీ. ప్రవాస భారతీయులతోనూ సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తోనూ మోదీ చర్చలు జరపనున్నారు. జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్స్‌తో బెర్లిన్‌లో మోదీ భేటీ కానున్నారు. భారత్ జర్మనీ ఆరో విడత సమావేశాలకు సంయుక్తంగా అధ్యక్షత వహించనున్నారు. షోల్స్‌తో మోదీ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం గురించి మూడు దేశాల నేతలతో భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. అటు హరిత వ్యూహాత్మక భాగస్వామ్యంపై డెన్మార్క్ నిర్వహిస్తున్న సదస్సులోనూ పాల్గొననున్నారు ప్రధాని మోదీ. డెన్మార్క్ సదస్సులో ఐస్‌లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ప్రధానులతో మోదీ సమావేశమవుతారు.
పర్యటనకు బయలుదేరే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, “నేను జర్మనీలోని ఫెడరల్ ఛాన్సలర్, హిస్ ఎక్సలెన్సీ ఓలాఫ్ స్కోల్జ్ ఆహ్వానం మేరకు 2 మే 2022న జర్మనీలోని బెర్లిన్‌ను సందర్శిస్తాను, ఆ తర్వాత నేను 3 నుండి 4 వరకు జర్మనీలోని బెర్లిన్‌లో సందర్శిస్తాను. డెన్మార్క్ ప్రధాన మంత్రి మెట్టె ఫ్రెడ్రిచ్‌సన్ ఆహ్వానం మేరకు. మే 2022 వరకు డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్‌లో సందర్శిస్తాను. అక్కడ నేను ద్వైపాక్షిక సమావేశాలకు హాజరవుతాను. 2వ భారతదేశం నార్డిక్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతాను. నేను తిరిగి భారతదేశానికి వెళ్లేటప్పుడు పారిస్‌లో ఉంటాను. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సమావేశం కోసం ఫ్రాన్స్ నేను కొంతకాలం ఉంటాను.” అని ప్రధాని మోదీ తెలిపారు.
PM @narendramodi emplanes for Berlin, where he will take part in various programmes aimed at strengthening India-Germany cooperation. pic.twitter.com/zuuAASvdAq
— PMO India (@PMOIndia) May 1, 2022
2021లో భారతదేశం జర్మనీ దౌత్య సంబంధాల స్థాపనకు 70 ఏళ్లు పూర్తయ్యాయి. 2000 నుండి రెండు దేశాలు వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయి. ఇరు దేశాలకు సంబంధించిన వ్యూహాత్మక, ప్రాంతీయ, ప్రపంచ పరిణామాలను ఛాన్సలర్ స్కోల్జ్‌తో పంచుకుంటారు ప్రధాని మోదీ. కాంటినెంటల్ యూరప్ భారతీయ సంతతికి చెందినవారు ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తున్నారు.ఈ ప్రవాస సంఘంలో గణనీయమైన భాగం జర్మనీలో నివసిస్తుంది. భారతీయ డయాస్పోరా ఐరోపాతో మన సంబంధాలకు ఒక ముఖ్యమైన పునాది.