
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొంగల్ జరుపుకున్నారు. దేశవాసులందరికీ పొంగల్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, ఈ పండుగ ప్రకృతి, కుటుంబం, సమాజం మధ్య సమతుల్యతను నెలకొల్పడానికి మార్గాన్ని చూపుతుందని అన్నారు. ఆయన కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ ఇంటికి వెళ్లి అన్ని ఆచారాలతో పూజలు చేశారు.
పండుగ సందర్భంగా తమిళ ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించిన ప్రధాని మోదీ, ఆ తర్వాత ఒక ఆవు, లేగ దూడకు మేత తినిపించి, వాటికి పూలమాల వేసి పూజలు చేశారు. ఈ పండుగ ప్రాముఖ్యతను వివరిస్తూ, ప్రధానమంత్రి, “ఈ పండుగ ప్రకృతి, కుటుంబం మరియు సమాజం మధ్య సమతుల్యతను నెలకొల్పే మార్గాన్ని చూపుతుంది. ప్రస్తుతం, సంక్రాంతి, లోహ్రీ, మకర సంక్రాంతి, మాఘ బిహు, ఇతర పండుగల పట్ల దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉత్సాహభరితమైన వాతావరణం ఉంది. దేశంలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సోదరసోదరీమణులందరికీ పొంగల్, అన్ని పండుగల సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని అన్నారు.
పొంగల్ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, “గత సంవత్సరం తమిళ సంస్కృతికి సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించడం చాలా ఆహ్లాదకరమైన అనుభవం. తమిళనాడులోని వెయ్యి సంవత్సరాల పురాతనమైన గంగైకొండ చోళపురం ఆలయంలో పూజలు చేశాను. వారణాసిలోని కాశీ తమిళ సంగమం సందర్భంగా, ప్రతి క్షణం సాంస్కృతిక ఐక్యత శక్తితో అనుసంధానించాను” అని అన్నారు.
ఈ వీడియో ఇక్కడ చూడండిః
“నేను పంబన్ వంతెనను ప్రారంభించడానికి రామేశ్వరం సందర్శించినప్పుడు, తమిళ చరిత్ర గొప్పతనాన్ని మరోసారి చూశాను. మన తమిళ సంస్కృతి మొత్తం భారతదేశం ఉమ్మడి వారసత్వం. అంతేకాదు, ఇది మొత్తం మానవాళి ఉమ్మడి వారసత్వం. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తి పొంగల్ వంటి పండుగల ద్వారా మరింత బలపడుతుంది” అని ప్రధానమంత్రి అన్నారు.
Pongal celebrates the vibrant Tamil culture and our bond with nature. May the festival bring prosperity and happiness to everyone’s life. Addressing a programme in Delhi.
https://t.co/NwwT3DHnp1— Narendra Modi (@narendramodi) January 14, 2026
తెలుగు వారికి సంక్రాంతి శుభాకాంక్షలు
అలాగే, ప్రధాని మోదీ బుధవారం తెలుగు ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగ అందరి జీవితాల్లో శ్రేయస్సు, విజయం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ‘X’ వేదికగా తెలుగులో శుభాకాంక్షలు తెలిపారు. “పవిత్రమైన మకర సంక్రాంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన నువ్వులు-బెల్లం తీపిదనంతో నిండిన ఈ దివ్యమైన పండుగ, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, విజయాన్ని తీసుకురావాలి. సూర్య భగవానుడు మనందరినీ ఆశీర్వదించాలి” అని పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..