PM Tour: ఆ రాష్ట్రాలలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. జాతికి అంకితమవనున్న ప్రాజెక్టులు..

|

Nov 19, 2022 | 10:01 AM

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం (నవంబర్ 19) అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను..

PM Tour: ఆ రాష్ట్రాలలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. జాతికి అంకితమవనున్న ప్రాజెక్టులు..
Pm Modi
Follow us on

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం (నవంబర్ 19) అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను ప్రధాని కార్యాలయం గురువారం(నవంబర్ 17)నాడే  విడుదల చేసింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక విమానాశ్రయాన్ని, హైడ్రో పవర్ స్టేషన్‌ను జాతికి అంకితమిస్తారు. అనంతరం ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసికి చేరుకుని అక్కడ ఓ సాంస్కృతిక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో మోదీ పర్యటన..

ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇటానగర్‌లోని డోనీ పోలో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ఈశాన్య రాష్ట్రాలలో కనెక్టివిటీని పెంచడంలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌లో మొదటి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంగా ‘డోనీ పోలో ఎయిర్‌పోర్ట్, ఇటానగర్’ నిలవనుంది.

Donyi Polo Airport, Itanaga

అనంతరం 600 మెగావాట్ల క‌మెంగ్ హైడ్రో ప‌వ‌ర్ స్టేష‌న్‌ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. 2300 మీటర్ల రన్‌వేతో ఈ విమానాశ్రయం అన్ని వాతావరణ కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

Airport Runway

అనంతరం 600 మెగావాట్ల క‌మెంగ్ హైడ్రో ప‌వ‌ర్ స్టేష‌న్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. దీనిని 8450 కోట్ల రూపాయల కంటే ఎక్కువ నిధులతో అభివృద్ధి చేయగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమెంగ్ జిల్లాలో 80 కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

Donyi Polo Airport Exit

ఈ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్‌ను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మారుస్తుందని ప్రధాని కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.

ఉత్తరప్రదేశ్‌లో మోదీ పర్యటన..

ప్రధాని మోదీ అరుణాచల్‌లో తన పర్యటన ముగిసిన తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసికి చేరుకుని, అక్కడ ‘కాశీ తమిళ సంగమా’ న్ని ప్రారంభిస్తారు. వారణాసిలో నవంబర్ 19 నుంచి నెల రోజులపాటు ‘కాశీ తమిళ సంగమం’ కార్యక్రమం జరగనుంది. దేశంలోని తమిళనాడు, కాశీ అత్యంత ముఖ్యమైన, పురాతన స్థానాలు.  ఈ ప్రాంతాల మధ్య పురాతన సంబంధాలను పెంపొందించడానికే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో రెండు ప్రాంతాలకు చెందిన పండితులు, విద్యార్థులు, తత్వవేత్తలు, వ్యాపారులు, కళాకారులు తదితర వర్గాలవారందరు ఒకచోటకు చేరి వారి వారి తత్వశాస్త్రాల గురించి చర్చించుకుంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఈ లింక్ మీద క్లిక్ చేయండి..